నా సినిమా అప్పుడే అందరి కష్టాలు గుర్తొస్తాయి: నిర్మాత నాగవంశీ | Tollywood Producer Naga Vamsi Comments On Movie Release Dates | Sakshi
Sakshi News home page

Naga Vamsi: అలా అయితే మేము కూడా సింపతీ కార్డ్ వాడాలేమో?: నాగవంశీ కామెంట్స్

Published Fri, Nov 15 2024 1:07 PM | Last Updated on Fri, Nov 15 2024 1:20 PM

Tollywood Producer Naga Vamsi Comments On Movie Release Dates

నందమూరి బాలకృష్ణ-బాబీ కాంబోలో వస్తోన్న తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ మూవీ అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్‌ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. విడుదలైన కొద్ది సేపటికే యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ‍్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.

అయితే ఇవాళ జరిగిన టీజర్‌ లాంఛ్ ఈవెంట్‌ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇందులో బాలయ్యను సరికొత్తగా చూపించనున్నట్లు తెలిపారు. మొత్తం ఐదు బ్లాక్స్‌ వేరే లెవల్లో ఉంటాయని అన్నారు. ఇంటర్వెల్ సీన్ బాలయ్య సీన్‌ మామాలుగా ఉండదని..టీజర్‌ కొన్ని ముక్కలు మాత్రమే కట్ చేసి చూపించామని నాగవంశీ వెల్లడించారు.

(ఇది చదవండి: బాలకృష్ణ 'డాకు మహారాజ్' టీజర్ రిలీజ్)

ఆ తర్వాత సంక్రాంతి రేస్‌, నాగవంశీ సినిమాల విడుదల డేట్స్‌పై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ ఏడాది గుంటూరు కారం, అలాగే లక్కీ భాస్కర్‌ సినిమా విడుదల సమయంలో మీకు పోటీగా ఏదైనా సింపతి కార్డ్ సినిమా వస్తోందా? అని చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది? దీనిపై మీరేమంటారని నాగవంశీని అడిగారు.

దీనికి ఆయన స్పందిస్తూ..' ఈ ప్రశ్న అడిగిన మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నా సినిమా టైమ్‌లోనే ఇలాంటి బాంబులు పేలుస్తున్నారు. అప్పుడే అందరి కష్టాలు గుర్తొస్తున్నాయి. ఇకనుంచి నేను కూడా ఏదైనా కష్టాలు వెతుక్కోవాలి.  వచ్చే సంక్రాంతికి మేము కూడా సింపతీ కార్డ్ వర్కవుట్ అవుతుందేమో చూడాలి' అంటూ సరదాగానే మాట్లాడారు.

కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో గుంటూరు కారంతో పాటు నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. హనమాన్, నాసామిరంగ, సైంధవ్‌ చిత్రాలు సందడి చేశాయి. ఈ పోటీలో హనుమాన్‌ హిట్‌గా నిలిచింది. ఇటీవల దీపావళీ సందర్భంగా లక్కీ భాస్కర్‌తో కిరణ్ అబ్బవరం క మూవీ బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. ఈ రెండు సినిమాలు కూడా హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement