![Tollywood Producer Naga Vamsi Comments On Cinema Tickets](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/10/13/surya_0.jpg.webp?itok=GFMQBclp)
టాలీవుడ్‌లో సినిమా టిక్కెట్లపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అన్నింటితో పోలిస్తే ఒక్క సినిమా రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. మూడు గంటల పాటు ఎంటర్‌టైన్ చేసేందుకు ఆ మాత్రం టిక్కెట్ రేట్ పెట్టలేరా అని ఆడియన్స్‌ను ప్రశ్నించారు. ఓ కుటుంబంలో నలుగురు కలిసి సినిమాకెళ్తే కేవలం రూ.1500 మాత్రమే ఖర్చవుతుందని అన్నారు.
దేవర సినిమాకు ఒక్క టికెట్ రూ.250 రూపాయలు అనుకుంటే నలుగురికి వెయ్యి రూపాయలు, పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్‌కు కలిపి రూ.500 దాకా అవుతుందన్నారు. ఇంతకన్నా తక్కువ ధరలో మూడు గంటల పాటు ఎంటర్ టైన్‌మెంట్ అందించేది ఎక్కడా లేదన్నారు. అమెరికాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంత తక్కువ ధరకు ఏక్కడైనా ఎంటర్‌టైన్మెంట్ దొరుకుతుందేమో చెప్పండి అని నాగవంశీ ప్రశ్నించారు.
కాగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ దేవర కలెక్షన్స్ గురించి నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అభిమానుల సంతోషం కోసమే తాము కలెక్షన్స్ వెల్లడిస్తామని తెలిపారు. వారు సంతోషంగా ఉంటే మాకు కూడా హ్యాపీ అని అన్నారు. కానీ డబ్బులు వచ్చాయని చెబుతుంటే కొందరు మాత్రం నమ్మడం లేదన్నారు. ఎప్పుడు కూడా వసూళ్ల విషయంలో అసత్యాలు ప్రచారం చేయలేదన్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు సైతం వసూళ్లపై ఫుల్ క్లారిటీ ఉన్నారని నాగవంశీ తెలిపారు.
సినిమా టికెట్ రేట్స్ కరెక్ట్ గానే ఉన్నాయి...
ఒక ఫ్యామిలీ ఒక సినిమాకి కనీసం 1500 కూడా పెట్టలేరా అంటున్న నాగ వంశీ...
VC: Great Andhra pic.twitter.com/UovWMmoJdi— Movies4u Official (@Movies4u_Officl) October 13, 2024
Comments
Please login to add a commentAdd a comment