'దేవర' కోసం అనుమతి ఇవ్వలేదు.. ఫ్యాన్స్‌ను క్షమాపణ కోరిన నాగవంశీ | Telugu States Not Permission Devara Success Meet | Sakshi
Sakshi News home page

'దేవర' కోసం అనుమతి ఇవ్వలేదు.. ఫ్యాన్స్‌ను క్షమాపణ కోరిన నాగవంశీ

Oct 3 2024 1:33 PM | Updated on Oct 3 2024 3:16 PM

Telugu States Not Permission Devara Success Meet

ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'దేవర'. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం అందుకున్న ఈ సినిమా ఆరు రోజులకుగాను ప్రపంచవ్యాప్తంగా రూ. 396 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టంది. దీంతో  సక్సెస్‌ మీట్‌ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, తాజాగా ఇదే విషయంపై నిర్మాత నాగవంశీ సోషల్‌మీడియాలో ఒక ప్రకటన చేశారు. అభిమానుల సమక్షంలో దేవర విజయోత్సవాన్ని ఘనంగా జరపాలని తాము కూడా భావించినట్లు  అన్నారు. కానీ, రెండు ప్రభుత్వాల నుంచి తమకు అనుమతులు రాకపోవడంతో ఈ సక్సెస్‌ మీట్‌ను నిర్వహించలేకపోతున్నట్లు నాగవంశీ తెలిపారు.

ఇండియన్‌ బాక్స్ ఆఫీస్ వద్ద దేవర అపూర్వమైన రికార్డులను నెలకొల్పడంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు కావడంతో  విజయోత్సవ వేడుకనైనా ఎంతో ఘనంగా చేయాలని ఎన్టీఆర్‌ ఎంతో బలంగా భావించారు. అందుకోసం మేము కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాం. అయితే,  దసరా, దేవీ నవరాత్రి ఉత్సవాలు ఉన్న కారణంగా దేవర వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనుమతులు రాలేదు. 

ఇదీ చదవండి: 'మా' కుటుంబాలను బాధపెడితే మౌనంగా ఉండను:  మంచు విష్ణు

ఈ పరిస్థితి మా నియంత్రణలో లేదు.  ఈ ఈవెంట్‌ను నిర్వహించలేకపోయినందుకు అభిమానులందరితో పాటు మా ప్రేక్షకులకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. అయినప్పటికీ, అనుమతి కోసం మేము ఇంకా ప్రయత్నిస్తున్నాము. మీ ప్రేమతో అన్న (ఎన్టీఆర్‌) మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నాను.' అని ఒక పోస్ట్‌ చేశారు.

సెప్టెంబర్‌ 27న విడుదలైన దేవర.. బాక్సాఫీస్‌ వద్ద భారీగానే కలెక్షన్లు రాబడుతుంది. రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబడుతుందిన ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటించగా  సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా మెప్పించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement