సంక్రాంతి సినిమాల సందడి ముగిసింది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద నాలుగు చిత్రాలు పోటీపడ్డాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నాసామిరంగా ప్రేక్షకులను పలకరించాయి. అయితే తీవ్రమైన పోటీ ఉండడంతో రవితేజ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసుకున్నారు. ఇక సంక్రాంతి సందడి ముగియడంతో అందరి దృష‍్టి సమ్మర్ సీజన్ సినిమాపైనే ఉంది. మరికొద్ది రోజుల్లో రానున్న సమ్మర్‌లో అలరించేందుకు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో థియేటర్ల సమస్యలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. ఈ సందర్భంగా రవితేజ ఈగల్ మూవీ మేకర్స్‌ను ఆయన ప్రశంసించారు. ఫిబ్రవరి 9న రిలీజవుతోన్న ఈ చిత్రానికి వీలైనన్నీ ఎక్కువ థియేటర్స్ కేటాయిస్తున్నట్లు తెలిపారు. అయితే కొరటాల శివ తెరకెక్కిస్తోన్న దేవర సినిమా రిలీజ్‌పై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సమ్మర్‌లో రిలీజ్ కావాల్సిన జూనియర్ ఎన్టీఆర్ మూవీ పోస్ట్ పోన్ అయితే తాము పోటీలో ఉంటామని తెలిపారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. 'సంక్రాంతి సినిమాలకు కచ్చితంగా పోటీ ఉంటుంది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. వచ్చే సంక్రాంతికి నేను ప్రెసిడెంట్‌గా ఉండను. మరో ఆరు నెలల్లో నా టర్మ్ అయిపోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి నా సినిమా తప్పకుండా ఉంటుంది. ఈ ఏడాది సమ్మర్‌లో దేవర సినిమా ఉంది. ఒకవేళ దేవర వాయిదా పడితే మేము వస్తామని అన్ అఫీషియల్‌గా చెప్పాం. దేవర పోస్ట్ పోన్ అయితే మా సినిమా ఫ్యామిలీ స్టార్ వస్తుంది. ఇప్పటికే ఒకసారి చెప్పాం కదా ' అని క్లారిటీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment