
టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ప్రస్తుత టీటీడీ బోర్డు పదవీకాలానికి అనుగుణంగా శ్రీ వేంకటేశ్వర దేవాలయాలు జూబ్లీహిల్స్, కరీంనగర్, హిమాయత్‌నగర్ లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా శ్రీ మోహన్ ముళ్ళపూడిని నియమించారు.
(ఇదీ చదవండి: మెట్లపై నిద్రపోయేది.. సుమ సీక్రెట్ బయటపెట్టిన మరో యాంకర్!)
ఈయన గతంలో పలు తెలుగు సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. అలాగే ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌కు గౌరవ సెక్రెటరీగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర దేవాలయాల లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా బాధ్యతలు చేపట్టారు.
జూబ్లీహిల్స్, కరీంనగర్, హిమాయత్‌నగర్‌లోని టీటీడీ దేవాలయాల మొత్తం అభివృద్ధిలో, అలానే కరీంనగర్‌లో నిర్మిస్తున్న కొత్త ఆలయానికి సంబంధించిన పనుల్లో లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా ఈయన బాధ్యతలు నిర్వహిస్తారు.
(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోగా 'గుప్పెడంత మనసు' రిషి.. ఆ సినిమాతో ఎంట్రీ)
Comments
Please login to add a commentAdd a comment