కోహినూర్‌ వజ్రం కోసం పోరాటం చేయనున్న సిద్దూ జొన్నలగడ్డ | Siddu Jonnalagadda New Movie Diamond Poster | Sakshi
Sakshi News home page

కోహినూర్‌ వజ్రం కోసం పోరాటం చేయనున్న సిద్దూ జొన్నలగడ్డ

Published Sat, Oct 12 2024 11:49 AM | Last Updated on Sat, Oct 12 2024 12:43 PM

Siddu Jonnalagadda New Movie Diamond Poster

దసరా సందర్భంగా సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా ప్రకటన వెలువడింది. ఈ మూవీకి 'కోహినూర్‌' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. రెండు భాగాలుగా ఈ ప్రాజెక్ట్‌ తెరకెక్కనుంది. అయితే, మరోసారి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో ఈ సినిమా రానుంది. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ రెండు చిత్రాలు కూడా బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్‌ సినిమాగా 'కోహినూర్‌'ను ప్రకటించారు.

విజయదశమి శుభ సందర్భంగా, భారతీయ సినిమా చరిత్రలో ఇంతవరకు ఎవరూ ఊహించని కథాంశంతో సినిమా చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. "కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం" అనే సంచలన కథాంశంతో ఈ మూవీ రూపొందనుంది. ఈ మూవీని  రవికాంత్ పేరెపు తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఆయన సిద్దూ జొన్నలగడ్డతో  'కృష్ణ అండ్ హిజ్ లీల' అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించారు. క్షణం వంటి  వంటి కల్ట్ థ్రిల్లర్‌ను కూడా ఆయన డైరెక్ట్‌ చేశారు. 

అయితే, ఇప్పుడు, సిద్ధూ-రవికాంత్ కలిసి సరికొత్త కథాంశంతో సోషియో-ఫాంటసీ డ్రామాతో వస్తున్నారు. భద్రకాళి మాత మహిమగా నిలిచిన ఐకానిక్ కోహినూర్ వజ్రం సామ్రాజ్యవాదుల చేతికి చిక్కింది. కోహినూర్ వజ్రాన్ని తిరిగి  తీసుకురావడానికి యువకుడు సాగించే చారిత్రాత్మక ప్రయాణంగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం 2026 జనవరిలో థియేటర్లలో అడుగుపెట్టంనుందని ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ సంయుక్తంగా సూర్యదేవర నాగవంశీ,  సాయి సౌజన్య భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement