
‘‘సార్’లాంటి సినిమాలు తీయడం ఆషామాషీ కాదు.. గుండె ధైర్యం కావాలి. ఇలాంటి ఒక మంచి చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు నమస్కరిస్తున్నాను’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘సార్’ (తమిళంలో ‘వాతి’).
సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆర్. నారాయణమూర్తి. ‘‘సార్’ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అన్నారు వెంకీ అట్లూరి. ‘‘కె. విశ్వనాథ్‌గారిలా ‘సార్’ చిత్రంతో తనదైన ముద్రను ఆరంభించాడు వెంకీ’’ అన్నారు తనికెళ్ల భరణి.
Comments
Please login to add a commentAdd a comment