ఈసారి సంక్రాంతికి భారీ అంచనాలతో రిలీజైన సినిమా 'గుంటూరు కారం'. మహేశ్-త్రివిక్రమ్ కాంబోలోని హ్యాట్రిక్ మూవీ ఇది. విడుదలకు ముందు ఫ్యాన్స్.. ఓ రేంజు అంచనాలు పెంచేసుకున్నారు. కానీ టాక్ రివర్స్ అయిపోయింది. రూ.150 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టుకుంది కానీ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసే విషయంలో నిరాశపరిచింది. తాజాగా ఓ ఈవెంట్‌లో 'గుంటూరు కారం' మూవీ గురించి ప్రశ్న ఎదురవగా.. నిర్మాత నాగవంశీ విచిత్రమైన సమాధానమిచ్చారు.
(ఇదీ చదవండి: బోల్డ్‌నెస్ గురించి ప్రశ్న.. బిర్యానీ, పులిహోర అని అనుపమ కౌంటర్స్)
'గుంటూరు కారం సినిమా విషయంలో మాకు ఎలాంటి బాధలేదు. బాధంతా కూడా మీడియాదే' అని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు. ఈయన చెప్పిన లెక్క ప్రకారం చూస్తే పెట్టిన డబ్బులొచ్చేయని అన్నట్లే. కానీ రియాలిటీ చూసుకుంటే ఈ మూవీ మహేశ్ అభిమానులే చాలామందికి నచ్చలేదు. అలానే సినిమాని కొన్న చాలామంది బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపోయారని సమాచారం. కానీ నాగవంశీ మాత్రం మీడియా బాధంతా అని చెప్పడం విడ్డూరంగా అనిపిస్తోంది. అలానే త్రివిక్రమ్-అల్లు అర్జున్ ప్రాజెక్ట్ అప్‌డేట్ గురించి అడగ్గా.. మరో ప్రెస్‌మీట్ లో చెబుతానని మాట దాటవేశారు.
సితార సంస్థ నుంచి త్వరలో రాబోతున్న మూవీ 'టిల్లూ స్క్వేర్'. 'డీజే టిల్లు' సినిమాకు సీక్వెల్‌గా తీసిన ఈ మూవీలో సిద్ధు, అనుపమ హీరోహీరోయిన్లుగా నటించారు. మల్లిక్ రామ్ దర్శకుడు. తొలి భాగంతో పోలిస్తే ఇందులో గ్లామర్, రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. మరి దీని ఫలితం ఫస్ట్ పార్ట్‌కి మించి ఉంటుందా? లేదా? అనేది చూడాలి.
(ఇదీ చదవండి: సిల్క్ స్మిత చేసిన పెద్ద తప్పు అదే: నటి జయమాలిని)
Comments
Please login to add a commentAdd a comment