సుకుమార్‌ డైరెక్షన్‌లో సినిమా చేయనున్న ప్రభాస్‌! | Prabhas impressed for Sukumar script on razakar movement | Sakshi
Sakshi News home page

రజాకారుల ఉద్యమ నేపథ్యంలో ప్రభాస్‌ సినిమా?

Published Sat, Apr 29 2023 4:03 AM | Last Updated on Sat, Apr 29 2023 6:27 AM

Prabhas impressed for Sukumar script on razakar movement - Sakshi

హీరో ప్రభాస్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమాకు రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రజాకారుల ఉద్యమం నేపథ్యంలో సుకుమార్‌ ఓ కథను రెడీ చేశారని, ఈ కథలో ప్రభాస్‌ హీరోగా నటిస్తారనే టాక్‌ తెరపైకి వచ్చింది.

ప్రస్తుతం ప్రభాస్‌ ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’, ‘రాజా డీలక్స్‌ ’(ప్రచారంలో ఉన్న టైటిల్‌) చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాల తర్వాత ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగాతో ‘స్పిరిట్‌’ మూవీ చేస్తారు. కాగా ‘స్పిరిట్‌’ షూటింగ్‌లో పాల్గొంటూనే, సుకుమార్‌ దర్శకత్వంలోని సినిమానూ సెట్స్‌పైకి తీసుకుని వెళ్తారట ప్రభాస్‌. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement