ఓ పెద్ద డాన్‌కి రైట్‌ హ్యాండ్‌గా.. | Prashanth Neel explains meaning of Prabhas Salaar | Sakshi
Sakshi News home page

రైట్‌ హ్యాండ్‌!

Published Mon, Dec 7 2020 5:49 AM | Last Updated on Mon, Dec 7 2020 7:15 AM

Prashanth Neel explains meaning of Prabhas Salaar - Sakshi

ఇటీవలే ‘సలార్‌’ అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు ప్రభాస్‌. ఇది యాక్షన్‌ ప్రధాన చిత్రం అని తెలిసిందే. ఈ సినిమా కథాంశం మొత్తం ముంబై మాఫియా చుట్టూ తిరుగుతుందన్నది తాజా సమాచారం. ‘కేజీయఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్యాన్‌ ఇండియా చిత్రంగా ‘సలార్‌’ తెరకెక్కనుంది. హొంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ ఈ సినిమా నిర్మించనున్నారు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ నడుస్తుందట. సలార్‌ అంటే లీడర్‌ అని ఓ అర్థం. ఈ సినిమాలో ఓ పెద్ద డాన్‌కి రైట్‌ హ్యాండ్‌గా ప్రభాస్‌ రోల్‌ ఉంటుందని టాక్‌. అలా ఉండేవాళ్లను కూడా సలార్‌ అంటారట. ఈ సినిమాలో యాక్షన్‌ భారీ మోతాదులో ఉంటుందని, యాక్షనే స్పెషల్‌ అట్రాక్షన్‌ అనీ తెలిసింది. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement