
అప్పుడు, ఇప్పుడు
అల్లు అర్జున్, సుకుమార్ స్నేహం ‘ఆర్య’ సినిమాతో మొదలైంది. ‘ఆర్య’తో దర్శకుడిగా పరిచయం అయ్యారు సుకుమార్. ఆ సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత వీళ్ల కాంబినేషన్‌లో ‘ఆర్య 2’ వచ్చింది. ‘ఆర్య 2’ సినిమా రిలీజ్ అయి బుధవారానికి పదేళ్లు అయింది. ఈ సందర్భంగా ‘ఆర్య 2’ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు అల్లు అర్జున్. ‘ఆర్య 2’ సమయంలో దిగిన ఫొటో ఒకటి, ఇటీవల దిగిన సెల్ఫీ ఒకటి పోస్ట్ చేసి – ‘‘సుక్కూ (సుకుమార్ నిక్‌నేమ్) జుట్టు రంగు మారింది. నా స్కిన్ మారింది. కానీ మా మధ్య ఉన్న ప్రేమ మారలేదు. మేమిద్దరం కలిసినప్పుడు ఉండే పిచ్చి మారలేదు. దాన్ని మళ్లీ త్వరలోనే చూడబోతున్నారు (వీళ్ల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న మూడో చిత్రాన్ని ఉద్దేశించి)’’ అని పేర్కొన్నారు అల్లు అర్జున్.
Comments
Please login to add a commentAdd a comment