
నాగశౌర్య, సుకుమార్
కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు నాగశౌర్య. కాశీ విశాల్ అనే నూతన దర్శకుడి చిత్రంలో నాగశౌర్య హీరోగా నటించనున్నారు. ప్రముఖ దర్శకులు సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో చేశారు కాశీ విశాల్. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై సుకుమార్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్ అధినేత శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. త్వరలో మరిన్ని విషయాలను తెలియజేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ సంగతి ఇలా ఉంచితే... హీరో నాగశౌర్య కెరీర్‌లో వన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన ‘ఛలో’ సినిమా విడుదలైన (ఫిబ్రవరి 2) తేదీనే ఆయన కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ రావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment