సుకుమారి 21... లవ్‌స్టోరీ | This is a distinct love story | Sakshi
Sakshi News home page

సుకుమారి 21... లవ్‌స్టోరీ

Published Mon, Sep 28 2015 11:55 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM

సుకుమారి 21... లవ్‌స్టోరీ

సుకుమారి 21... లవ్‌స్టోరీ

స్టార్ డెరైక్టర్ సుకుమార్ తొలిసారి కథ, స్క్రీన్‌ప్లే అందించి, తొలి ప్రయత్నంగా నిర్మించిన చిత్రం ‘కుమారి 21 ఎఫ్’. రాజ్‌తరుణ్, హేభా పటేల్ జంటగా సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సుకుమార్ మాట్లాడుతూ- ‘‘ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం.

యూత్‌తో పాటు అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే అంశాలుంటాయి. రత్నవేలు ఫొటోగ్రపీ, దేవిశ్రీ ప్రసాద్‌ల సంగీతం ఈ చిత్రానికి హైలైట్’’ అని చెప్పారు. ‘‘సుకుమార్ మార్క్‌లో సాగే అందమైన ప్రేమకథ ఇది. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. అక్టోబర్‌లో పాటలను, అదే నెల 30న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటర్: అమర్‌రెడ్డి, ఆర్ట్: బి.రామచంద్రసింగ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement