దారి తప్పింది... దడ పుట్టింది! | Rakul Preet scary moments in London | Sakshi
Sakshi News home page

దారి తప్పింది... దడ పుట్టింది!

Published Sun, Aug 9 2015 10:38 PM | Last Updated on Tue, Aug 14 2018 3:25 PM

దారి తప్పింది... దడ పుట్టింది! - Sakshi

దారి తప్పింది... దడ పుట్టింది!

 ‘‘కారులో జస్ట్ ఇలా స్ట్రయిట్‌గా వెళ్లి, అలా లెఫ్ట్ తీసుకుని, ఓ యు టర్న్ తీసుకుని.. మళ్లీ స్టార్టింగ్ పాయింట్‌కే వచ్చేయాలి’’ అని రకుల్ ప్రీత్‌సింగ్‌తో అన్నారు దర్శకుడు సుకుమార్. ఓస్ ఇంతేనా అంటూ రకుల్ కారు స్టార్ట్ చేశారు. సుకుమార్ చెప్పిన ప్రకారమే రకుల్ చేసి ఉంటే, అంతా సజావుగానే జరిగి ఉండేది. కానీ, అలా జరగలేదు. రకుల్ దారి తప్పారు. స్వదేశంలో దారి తప్పితేనే కష్టం. ఇక, విదేశాల్లో దారి తప్పితే వేరే చెప్పాలా? ఇంతకీ రకుల్‌కి సుకుమార్ అలా కారులో వెళ్లమని ఎందుకు చెప్పినట్లు? ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న చిత్రం షూటింగ్ లండన్‌లో జరుగుతోంది.
 
  చిత్రకథానాయిక రకుల్  ప్రీత్ సింగ్ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే సీన్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. రకుల్ హావభావాలు క్యాప్చర్ చేయడానికి కారులో ఆమె ముందు ఓ కెమెరా ఫిక్స్ చేశారు. దర్శకుడు యాక్షన్ అనగానే రకుల్ కారు స్టార్ట్ చేశారు. కొంచెం దూరం వరకూ బాగానే నడిపారు. మార్గమధ్యంలో ఆమెకేదో అనుమానం వచ్చింది. ఇక అంతే... కారు ఆపేసి వెనక్కి తిరిగి చూసుకునే సరికి... రావాల్సిన రూట్‌లో రాలేదని, దారి తప్పానని ఆమెకు అర్థమైంది. ఒక్క వాకీ టాకీ తప్ప రకుల్ దగ్గర సెల్‌ఫోన్ కూడా లేదు. కానీ, ఆ వాకీ టాకీ సిగ్నల్స్ ఆమె ఉన్న ప్రాంతానికి అందడం లేదు.
 
 పోనీ.. పబ్లిక్ బూత్ నుంచి యూనిట్ సభ్యులకు ఫోన్ చేద్దామంటే ఎవరి నంబరూ తెలియదు. ఒక్కసారిగా రకుల్‌కి దడ పుట్టింది. సహాయం కోసం గట్టిగా అరవడం మొద లుపెట్టారామె. అటుగా వెళుతున్న స్థానికులు ఏం జరిగిందని అడగ్గా ఆమె జరిగిన విషయం అంతా చెప్పారు. ఈలోపు వాకీటాకీకి సిగ్నల్ వచ్చింది. దాని సహాయంతో యూనిట్‌ని కాంటాక్ట్ చేస్తే, వాళ్లొచ్చి రకుల్‌ని తీసుకెళ్లారు.  దాంతో ఈ బ్యూటీ ఊపిరి పీల్చుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement