సుకుమార్ నిర్మాతగా..రాజ్‌తరుణ్ హీరోగా... | Raj Tarun's new film with director Sukumar | Sakshi
Sakshi News home page

సుకుమార్ నిర్మాతగా..రాజ్‌తరుణ్ హీరోగా...

Published Tue, Oct 28 2014 11:26 PM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM

సుకుమార్ నిర్మాతగా..రాజ్‌తరుణ్ హీరోగా...

సుకుమార్ నిర్మాతగా..రాజ్‌తరుణ్ హీరోగా...

‘నిర్మాతగా మారి సినిమాలు నిర్మించాలని ఉంది’ అని గతంలో ప్రకటించిన దర్శకుడు సుకుమార్... మాట నిలబెట్టుకుంటూ నిర్మాతగా ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు. పిఎ మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయ్ బండ్రెడ్డి, థామస్ రెడ్డిలతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఉయ్యాల జంపాల’ ఫేం రాజ్‌తరుణ్ కథానాయకుడు. షీనా బజాజ్ కథానాయిక. ‘కరెంట్’ఫేం పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. సుకుమార్ సినిమాల తరహాలో వైవిధ్యంగా సాగే క్యూట్ లవ్‌స్టోరీ ఇదని, సుకుమార్ స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్ అని నిర్మాతలు విజయ్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి తెలిపారు. నవంబర్ 9న చిత్రీకరణ ప్రారంభమయ్యే ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: రత్నవేలు, కళ: రవీంద్ర, సహ నిర్మాత: ఎం.రాజా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement