
కొత్త వ్యక్తీకరణతో రాసే పాటలు వినడానికి చెవులు కూడా ఉత్సాహపడతాయి. ఆర్య 2 చిత్రం కోసం బాలాజీ రాసిన ఈ పాట చూడండి. పల్లవి ఎంత ఫ్రెష్షుగా ఉంటుంది!
‘ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో
చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో
తియ్యనైన ఈ బాధకి ఉప్పునీరు కంట దేనికో
రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో
నిన్ను చూసే ఈ కళ్లకీ లోకమంత ఇంక ఎందుకో
రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో’
రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో? ప్రేమలోని అత్యున్నత గాఢతను ఇంతకంటే ఏ భావం తెలియజేస్తుంది! నాయకుడి స్వభావానికి తగిన పాదాలతో సాగే ఈ పాటలోని చరణంలో ఒకచోట– ‘తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలి’ అని వస్తుంది. ఇది ప్రేమ తీవ్రతను మరింత తీవ్రంగా చెప్పిన వ్యక్తీకరణ. 2009లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్. సంగీత దర్శకుడు సుకుమార్ రెగ్యులర్ అయిన దేవిశ్రీ ప్రసాద్. పాడింది కేకే. కాజల్ అగర్వాల్, అల్లు అర్జున్ నటీనటులు.
Comments
Please login to add a commentAdd a comment