
థాయ్‌లాండ్, అల్లు అర్జున్, సుకుమార్, రష్మికా మందన్నా
ఈ ఏడాది చివర్లో థాయ్‌లాండ్‌లో ల్యాండ్ అవనున్నారట అల్లు అర్జున్, సుకుమార్. కొన్ని రోజుల పాటు అక్కడే ఉండేదుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారట. ‘ఆర్య, ఆర్య 2’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేయనున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథాంశం అట. ఇందులో అల్లు అర్జున్ గుబురు గడ్డం లుక్‌లో చిత్తూరు యాస మాట్లాడతారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ నల్లమల అడవులతో పాటు థాయ్‌లాండ్ అడవుల్లోనూ జరగనుందట. అందుకే ఈ ఏడాది చివర్లో థాయ్‌లాండ్ అడవుల్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసిందట చిత్రబృందం. రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment