thupaki Ramudu
-
సత్తి హీరో అయ్యాడోచ్
యాంకర్‌గా, నటుడిగా ఫేమస్ అయిన ‘బిత్తిరి’ సత్తి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘తుపాకి రాముడు’. ‘బతుకమ్మ’ ఫేమ్ టి. ప్రభాకర్ దర్శకత్వంలో రసమయి బాలకిషన్ నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా సినిమా పూర్తయింది. ఈ చిత్రం మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ను దర్శకుడు సుకుమార్ రిలీజ్ చేసి మాట్లాడుతూ– ‘‘బిత్తిరి సత్తి’గా పరిచయమైన సత్తి ఈ సినిమాతో మరో కోణంలో కనిపిస్తున్నారు. నాకు పరిచయమైన తొలి దర్శకుడు ప్రభాకర్‌గారు. ఎంతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించి ఉంటారనుకుంటున్నాను. ఈ సినిమా అందరికీ మంచి పేరు, సక్సెస్ తేవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘యూనివర్శల్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సత్తిని కొత్త కోణంలో చూపిస్తున్నాం. బాలకిషన్‌గారు రాజీ పడ కుండా నిర్మించారు’’ అన్నారు టి.ప్రభాకర్. ‘‘సత్తిని హీరోగా పరిచయం చేయడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంతో పాటు ఈ చిత్రం సత్తిని బిజీ నటుడిని చేస్తుంది’’ అన్నారు బాలకిషన్. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మక్కపాటి చంద్రశేఖర్, మక్బూల్ హుస్సేన్. -
‘తుపాకీ రాముడు’గా బిత్తిరి సత్తి
ఓ టీవీ ఛానల్ కార్యక్రమంతో ఫేమస్ అయిన బిత్తిరి సత్తి ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు. పలు టీవీ షోలకు గెస్ట్ గానూ వ్యవహరిస్తున్న సత్తి త్వరలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తెలంగాణ కళాకరుడు, ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి రసమయి బాలకిషన్ నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమాలో బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో నటించనున్నాడు. బతుకమ్మ సినిమాకు దర్శకత్వం వహించిన టి.ప్రభాకర్ ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈప్రాజెక్ట్‌కు తుపాకీ రాముడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 2న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
తుపాకీ రాముడిని తలపిస్తున్న సీఎం
కేసీఆర్‌పై ఈరవత్రి అనిల్ విమర్శలు కమ్మర్పల్లి : మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కేసీఆర్ తన పాలనతో తుపాకి రాముడిని తలపిస్తున్నారని ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయ న కమ్మర్‌పల్లిలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితులు లేవన్నారు. బంగారు తెలంగాణ సాధించుకుందామన్న కేసీఆర్.. తన పాలనతో బాధల తెలంగాణగా మారుస్తున్నారన్నారు. అర్హులెందరికో పింఛన్ దక్కలేదన్నారు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న సమగ్ర కుటుంబ సర్వేతో ప్రజలకు, ప్రభుత్వానికి ఒరి గిందేమీ లేదన్నారు. వ్యవసాయానికి సక్రమం గా విద్యుత్ సరఫరా చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. పంట రుణా ల మాఫీ వల్ల రైతులకు ప్రయోజనం కలగలేదన్నారు. రాష్ట్రం కలిసి ఉన్నప్పటి పరిస్థితికంటే విడిపోయాకే దారుణంగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం పెదవి విప్పకపోవడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ పింఛన్లు, ఆహార భద్రత కార్డులు ఇప్పించేందుకు పోరాడుతామని పేర్కొన్నారు. సమావేశంలో కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రవి, పార్టీ బాల్కొండ అధ్యక్షుడు గంగారెడ్డి, నాగంపేట సర్పంచ్ ముత్తెన్న, ఎన్ఎస్యూఐ నియోజకవర్గ అధ్యక్షుడు అశోక్, నాయకులు శ్రీనివాస్, రఫీ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.