తుపాకీ రాముడిని తలపిస్తున్న సీఎం
కేసీఆర్‌పై ఈరవత్రి అనిల్ విమర్శలు
కమ్మర్‌పల్లి : మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కేసీఆర్ తన పాలనతో తుపాకి రాముడిని తలపిస్తున్నారని ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయ న కమ్మర్‌పల్లిలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితులు లేవన్నారు. బంగారు తెలంగాణ సాధించుకుందామన్న కేసీఆర్.. తన పాలనతో బాధల తెలంగాణగా మారుస్తున్నారన్నారు.
అర్హులెందరికో పింఛన్ దక్కలేదన్నారు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న సమగ్ర కుటుంబ సర్వేతో ప్రజలకు, ప్రభుత్వానికి ఒరి గిందేమీ లేదన్నారు. వ్యవసాయానికి సక్రమం గా విద్యుత్ సరఫరా చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. పంట రుణా ల మాఫీ వల్ల రైతులకు ప్రయోజనం కలగలేదన్నారు. రాష్ట్రం కలిసి ఉన్నప్పటి పరిస్థితికంటే విడిపోయాకే దారుణంగా ఉందని పేర్కొన్నారు.
విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం పెదవి విప్పకపోవడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ పింఛన్‌లు, ఆహార భద్రత కార్డులు ఇప్పించేందుకు పోరాడుతామని పేర్కొన్నారు. సమావేశంలో కమ్మర్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రవి, పార్టీ బాల్కొండ అధ్యక్షుడు గంగారెడ్డి, నాగంపేట సర్పంచ్ ముత్తెన్న, ఎన్‌ఎస్‌యూఐ నియోజకవర్గ అధ్యక్షుడు అశోక్, నాయకులు శ్రీనివాస్, రఫీ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.