సాక్షి, నిజామాబాద్: టీవీ యాంకర్ కావలి రవికుమార్ అలియాస్ బిత్తిరి సత్తిపై దాడికి వ్యతిరేకంగా నిజామాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విలేకరులు, సీపీఐ, సీపీఎం, ఎంబీసీ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. అనంతరం బిత్తిరి సత్తికి మద్దతుగా జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ యాసను బిత్తిరి సత్తి కించపరుస్తున్నాడని ఆయనపై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎమ్మెల్యే కాలనీలో ఉన్న వీ6 చానల్ ముందు ఆ చానల్ తీన్మార్ యాంకర్ బిత్తిరి సత్తిపై సికింద్రాబాద్ కలాసిగుడకు చెందిన మణికంఠ(26) అనే యువకుడు హెల్మెట్‌తో దాడి చేశాడు. తలకు గాయాలైన బిత్తిరి సత్తిని స్థానికులు వెంటనే స్టార్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి మణికంఠను అదుపులోకి తీసుకున్నారు.
Published Tue, Nov 28 2017 1:59 PM | Last Updated on Tue, Nov 28 2017 1:59 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment