Actor Sarath Babu Nephew Introduced As Hero With Daksha Movie - Sakshi
Sakshi News home page

Sarath Babu: శరత్‌బాబు ఫ్యామిలీ నుంచి హీరోగా డెబ్యూ..

Published Thu, Dec 2 2021 8:13 AM | Last Updated on Thu, Dec 2 2021 12:53 PM

Actor Sarath Babu Nephew Introduced As Hero With Daksha Movie  - Sakshi

Actor Sarath Babu Nephew Introduced As Hero With Daksha Movie : ప్రముఖ నటుడు శరత్‌బాబు సోదరుడి కుమారుడు ఆయుష్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘దక్ష’. ఈ చిత్రంలో అను, నక్షత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. వివేకానంద విక్రాంత్‌ దర్శకత్వంలో తల్లాడ శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ లోగోను తనికెళ్ల భరణి, శరత్‌కుమార్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా తనికెళ్ల మాట్లాడుతూ – ‘‘దక్ష’ అంటే అన్ని వ్యవహారాలు సమన్వయం చేసేవాడని అర్థం. అతడే మా తల్లాడి సాయికృష్ణ.

చిన్న స్థాయి నుంచి వచ్చిన సాయికృష్ణ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ఆయుష్‌ నాక్కూడా కొడుకులాంటివాడే. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు శరత్‌బాబు. ‘‘హీరో అవ్వాలన్న నా కల ఈ చిత్రంతో నేరవేరింది. ఈ థ్రిల్లర్‌ మూవీని వచ్చే ఏడాది విడుదల చేస్తాం’’ అన్నారు ఆయుష్‌. ‘‘షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’ అన్నారు సహనిర్మాత తల్లాడ సాయికృష్ణ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement