
వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉండే ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ఇప్పుడు అనుకోని వివాదంలో చిక్కుకున్నాడు. తనకు మంచిపేరు తెచ్చిపెట్టిన 'శబ్బాష్ రా శంకరా' కవితలే ఇప్పుడు ఈ విమర్శలకు తావు తీశాయి. ఈ పేరుతో ఓ పుస్తకం ప్రచురించిన ఆయన దీనికి కొనసాగింపుగా ఫేస్‌బుక్ ద్వారా కొత్త కవితలను అభిమానులకు పరిచయం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన తాజాగా పోస్ట్ చేసిన ఓ కవిత హేతువాదుల ఆగ్రహానికి గురైంది. దీంతో ఆయన అందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాడు.
"ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన శబ్బాష్ రా శంకరా కవితలో దురదృష్టవశాత్తూ కొన్ని వాక్యాలు కొందరి మనసులను నొప్పించాయి. ఆ కవితకు వివరణ ఇస్తే కవరింగ్‌లాగా ఉంటుంది. కాబట్టి అలాంటిదేం చేయకుండా నొప్పించినందుకు నా చేతులు జోడించి బేషరతుగా క్షమాపణలు చెప్తున్నా. ఆ పోస్టు కూడా డిలీట్ చేశాను. నాకు హేతువాదులన్నా, మానవతావాదులన్నా గౌరవమే తప్ప వ్యతిరేకత లేదు. అలాగే ఏ మనిషికీ ఇంకొకరిని నొప్పించే అధికారమే లేదు. జరిగిన పొరపాటుకు మన్నించండి" అని తనికెళ్ల భరణి కోరాడు.
చదవండి: ఇప్పుడు ప్రశాంత్ వర్మను చూసినప్పుడు అదే ఫీలింగ్ కలిగింది: తనికెళ్ల భరణి
Comments
Please login to add a commentAdd a comment