దైవికంగా అంతా బాగా కుదిరింది : తనికెళ్ల భరణి
‘‘ద ర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు రాత్రిళ్లే షూటింగ్ ఉంటుందని గ్రహించాను. చాలా కష్టమనుకున్నాను. కానీ దైవికంగా అంతా బాగా కుదిరింది. కార్తీక్ చాలా అద్భుతంగా తీశాడు. భవిష్యత్తులో తను పెద్ద దర్శకుడు అవుతాడు’’ అని తనికెళ్ల భరణి చెప్పారు. నిఖిల్, త్రిదా జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో బేబి త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ‘సూర్య వెర్సస్ సూర్య’ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. సత్యమహావీర్ స్వరాలందించిన ఈ సినిమా పాటల సీడీని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాద వ్ ఆవిష్కరించి, విభిన్న నేపథ్యంతో తీసిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలన్నారు.
నిఖిల్ మాట్లాడుతూ- ‘‘ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. చందూ, కార్తీక్, నేను ఓ మంచి సినిమా తీయాలన్న ఆకాంక్షతో ఈ ప్రాజెక్ట్ చేశాం’’ అన్నారు. ఒక షార్ట్ ఫిలిం తీయడానికి ఆరు నెలలు తీసుకున్నాననీ, కానీ ఈ చిత్రాన్ని ఆరు నెలల్లోనే పూర్తి చేశాననీ, దీనికి చిత్రబృందం సహకారమే కారణమనీ దర్శకుడు అన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెస్ రాజు, సందీప్ కిషన్, వీరభద్రం, సుశాంత్, ఎన్.శంకర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.