కృష్ణవంశీ దర్శకత్వంలో భక్తిరస చిత్రం | Krishna Vamsy To Direct Bhakta Kannappa With Manchu Vishnu | Sakshi
Sakshi News home page

కృష్ణవంశీ దర్శకత్వంలో భక్తిరస చిత్రం

Published Wed, Oct 5 2016 10:34 AM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

కృష్ణవంశీ దర్శకత్వంలో భక్తిరస చిత్రం

కృష్ణవంశీ దర్శకత్వంలో భక్తిరస చిత్రం

కృష్ణంరాజు హీరోగా తెరకెక్కిన చారిత్రక చిత్రం భక్త కన్నప్ప ఈ సినిమాను ఈ జనరేషన్ మెచ్చేలా అత్యున్నత సాంకేతిక విలువలతో రీమేక్ చేయాలన్న ప్రయత్నం చాలా రోజులుగా జరుగుతోంది. ముందుగా కృష్ణంరాజు, ప్రభాస్ హీరోగా ఈ సినిమాను చేయడానికి ప్లాన్ చేశాడు అయితే ఈ లోగా రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి తన స్వీయ దర్శకత్వంలో కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు.

కామెడీ నుంచి హీరో క్యారెక్టర్లకు మారిన సునీల్ హీరోగా భక్తకన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు భరణి. అయితే ఈ సినిమా పట్టాలెక్కలేదు. తరువాత అదే సినిమాను మంచు విష్ణు తన సొంత నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. తనికెళ్ల భరణి దర్శకత్వంలోనే ఈ సినిమా ఉంటుదన్న టాక్ వినిపించింది.

తాజాగా భక్తకన్నప్ప సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వంలో వహిస్తాడంటూ టాక్ నడుస్తోంది. తనికెళ్ల భరణి తయారు చేసిన కథనే.. కృష్ణవంశీ డైరెక్ట్ చేయనున్నాడట. విష్ణు హీరోగా తెరకెక్కబోయే ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా నక్షత్రం సినిమాను తెరకెక్కిస్తున్న వంశీ, ఆ తరువాత మంచు విష్ణుతో తెరకెక్కబోయే సినిమా పనులు మొదలెట్టనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement