ఇప్పుడు కన్నప్ప మారాడు! | Tanikella bharani bhakta Kannappa with Manchu vishnu | Sakshi
Sakshi News home page

ఇప్పుడు కన్నప్ప మారాడు!

Published Mon, Jun 15 2015 11:03 PM | Last Updated on Sun, Sep 3 2017 3:47 AM

ఇప్పుడు కన్నప్ప మారాడు!

ఇప్పుడు కన్నప్ప మారాడు!

ఒక కథకు ముందు ఓ హీరోను అనుకొన్నా... చివరకు ఆ కథ వేరే హీరోతో తెరకెక్కడం సినిమా రంగంలో సర్వసాధారణం. ఈ మధ్య పూరి అనుకున్న కథకు నితిన్ ఎంపికై, తర్వాత ఆ స్థానంలో వరుణ్ తేజ్ వచ్చారు. తాజాగా మరో సినిమాకు అలా జరిగింది. భక్త కన్నప్ప జీవితం ఆధారంగా తాను దర్శకత్వం వహించా లనుకున్న చిత్రంలో టైటిల్ రోల్‌కు హీరోగా మారిన కమెడియన్ సునీల్‌ను ముందు ఎంపిక చేశారు దర్శక - రచయిత తనికెళ్ల భరణి.
 
  ఇప్పుడు అదే కథను మరో హీరోతో తనికెళ్ల తెరకెక్కించనున్నారు. ఈ ‘కన్నప్ప కథ’లో టైటిల్ రోల్‌ను మంచు విష్ణు పోషించనున్నారు. ఈ చిత్రాన్ని ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్‌బాబు నిర్మించను న్నారు. ‘‘కన్నప్ప కథ ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకట్టుకుంటుందని, కథ ఓకే అయిన ప్పట్నుంచీ ఎంతో ఉద్వేగంగా ఉన్నాం’’ అని విష్ణు అన్నారు. భారతీయ భాషలన్నింటిలోనూ ఈ చిత్రాన్ని నిర్మించనున్నామని, ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement