' ఓరి దేవుడా ' ఓటీటీ పార్ట్‌నర్ అదేనా? | Ori Devuda Movie OTT Release Partner Fixed On AHA | Sakshi
Sakshi News home page

Ori Devuda Movie: ఓటీటీకి 'ఓరి దేవుడా'.. స్ట్రీమింగ్ అక్కడేనా?

Published Fri, Oct 21 2022 9:14 PM | Last Updated on Fri, Oct 21 2022 9:15 PM

Ori Devuda Movie OTT Release Partner Fixed On AHA - Sakshi

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌, మిథిలా పాల్కర్ జంటగా నటించిన చిత్రం ఓరి దేవుడా. అశ్వథ్‌ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్టరి వెంకటేశ్‌ కీలక పాత్ర పోషించారు.  మిథిలా పాల్కర్‌, ఆశాభట్‌ హీరోయిన్లుగా నటించారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇవాళ విడుదలైన థియేటర్లలో సందడి చేస్తోంది. ‍అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్‌ను ఖాయం చేసుకుందని సమాచారం.

(చదవండి: ఆయనతో నటించడం మా అదృష్టం: ‘ఓరి దేవుడా’ హీరోయిన్స్‌)

 ఈ రొమాంటిక్ కామెడీ, డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ 'ఆహా'  సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. ఆశా భట్, రాహుల్ రామకృష్ణ  కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతమందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement