Ori Devuda Movie OTT Release Date Confirmed, Check Streaming Platform - Sakshi
Sakshi News home page

Ori Devuda OTT Release: ‘ఓరి దేవుడా..!’ అప్పుడే ఓటీటీలోకి... స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

Published Thu, Nov 10 2022 1:09 PM | Last Updated on Thu, Nov 10 2022 1:26 PM

Ori Devuda Movie OTT Release Date Out - Sakshi

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌, మిథిలా పాల్కర్ జంటగా నటించిన చిత్రం ఓరి దేవుడా. అశ్వథ్‌ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్టరి వెంకటేశ్‌ కీలక పాత్ర పోషించారు.  ఆశాభట్‌ మరో హీరోయిన్‌. దీపావళి సందర్భంగా  అక్టోబర్‌ 21న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. దీంతో ఈ సినిమాను అనుకున్న దానికంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కావడానికి రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ఆహాలో ఈ రోజు(నవంబర్‌ 11) అర్థరాత్రి 12 గంటలకు ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని ఆహా సంస్థ ట్విటర్‌ వేదికగా తెలియజేసింది. 

. ‘దేవుడా ఓ మంచి దేవుడా తినడానికి పాలకూర పప్పు, ఆలూ ఫ్రై ఇచ్చావ్‌. నాలాగే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్లందరి కోసం చూడడానికి ఆహాలో ఓరి దేవుడా సినిమాను ఇచ్చావు’ అంటూ ఓరి దేవుడా ఓటీటీ రిలీజ్‌ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది ఆహా. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతమందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement