మంచు విష్ణు తాజాగా నటిస్తున్న చిత్రం జిన్నా. షూటింగ్ అనంతరం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 21వ తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. మూవీ ప్రమోషన్స్ భాగంగా ఆదివారం జిన్నా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ నిర్వహించింది ఈ చిత్రం బృందం. ఈ సందర్బంగా హీరో మంచు విష్ణు జిన్నా మూవీ టీంకు కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే తన తండ్రి, విలక్షణ నటుడు మోహన్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: హన్సిక రాయల్ వెడ్డింగ్, పెళ్లి జరిగేది ఎక్కడంటే?
ఈ మేరకు విష్ణు మాట్లాడుతూ.. ‘జిన్నా మూవీ నా మనసుకి మరింత దగ్గరైంది. ఈ సినిమాకు అనూబ్ రూబెన్స్ అద్భుతమైన సంగీతం అందించారు. నా కెరియర్లోనే బెస్ట్ మ్యూజిక్ ఈ సినిమాకు కుదిరింది. అంతేకాదు నా పిల్లలు అరియానా-వివియానాలు ఓ పాట పాడటం విశేషం. ఇందుకు అనూప్‌కు ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. అనంతరం తన తండ్రి మోహన్ బాబును ఉద్దేశిస్తూ... ఆయన నుంచి చాలా విషయాల్లో స్ఫూర్తి పొందాను అని అన్నాడు. ఒకటి తప్ప ఆయన నుంచి చాలా నేర్చుకున్నానన్నాడు. అదే ఆయన కోపమని, ఆయనలో తనకు నచ్చనిది కూడా అదేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment