‘లక్ష్మీ కళ్యాణం’ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ ఇక్కడ తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా ఆఫర్లును అందిపుచ్చుకుంటూ అగ్ర హీరోయిన్‌గా రాణిస్తున్న క్రమంలోనే కాజల్, ముంబై వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగు పెట్టిన హీరోయిన్లు సినిమాల్లో వేగం తగ్గించడం వల్ల వారికి అవకాశాలు తగ్గుతాయని అందరూ అభిప్రాయపడుతుంటారు. కానీ కాజల్ మాత్రం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అలా అని పూర్తిగా సినిమాలకే అంకితం కాకుండా అటూ భర్త కిచ్లుకు కూడా తగినంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇటూ వైవాహిక బంధాన్ని.. అటూ సినీ కెరీర్‌ను బాగానే మేనేజ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ భామ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తోన్న సంగతి తెలిసిందే. (చదవండి: ప్రపంచాన్ని మార్చేయాలని ఉంది)
దీనితో పాటు కమల్ హాసన్ ‘ఇండియన్-2’లో కూడా నటిస్తున్నారు. అంతేగాక డైరెక్టర్ తేజ తెరకెక్కించనున్న ‘అలివేలు వెంకటరమణ’లో నటించేందుకు మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి ఆ తర్వాత ఈ సినిమా నుంచి తప్పుకుంంది కాజల్. తాజాగా ప్రముఖ కోరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవతో మొదటిసారిగా జతకట్టనున్నదంట ఈ ‘చందమామ’ బ్యూటీ. తమిళ చిత్రం ‘గులేబకావలి’ ఫేం డి. కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రోమాంటిక్, కామెడీ, థ్రీల్లర్ నేపథ్యంలో తెరకెక్కనుందట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని చిత్ర వర్గాల నుంచి సమాచారం. కాగా ప్రభుదేవా 50వ చిత్రం ‘పోన్ మణికవేల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేగాక బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, దిషా పటానీలు జంటగా నటిస్తున్న ‘రాధే’ సినిమాకు ఆయన దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న ప్రభుదేవా!)
Comments
Please login to add a commentAdd a comment