
రవితేజనీ, ఇలియానా
పదేళ్ల తర్వాత రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా రూపొందుతుండటం ఒక స్పెషల్. వీళ్ల కాంబినేషన్‌లో 2007లో ‘దుబాయ్ శీను’ సినిమా వచ్చింది. అలాగే ఆరేళ్ల తర్వాత హీరో రవితేజ సరసన ఇలియానా నటించనుండటం ఇంకో స్పెషల్. 2012లో ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో ఇలియానా, రవితేజ కలిసి నటించారు. ఇప్పుడు రవితేజ సినిమాతోనే ఇలియానా మళ్లీ సౌత్‌లోకి రావడం సమ్‌థింగ్ స్పెషల్. ఇప్పుడీ సినిమాలో వన్‌మోర్ స్పెషల్ థింగ్ ఉంది. అదేంటంటే.. ఈ సినిమా సన్నివేశాలను రెడ్ మాస్ట్రో కెమెరా, జీస్ సుప్రీమ్ లెన్సెస్‌ను ఉపయోగించి చిత్రీకరిస్తున్నారు.
అంతేకాదండోయ్.. 8కే రిజల్యూషన్‌తో షూట్ చేస్తోన్న తొలి తెలుగు సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’నే అని చిత్రబృందం చెబుతోంది. అమెరికాలోని విభిన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ టెక్నాలజీని వాడుతున్నారు. మరి.. ఇన్ని స్పెషల్స్ ఉన్న ఈ సినిమా సిల్వర్‌స్క్రీన్‌పై సూపర్ స్పెషల్‌గా ఉండబోతుందన్నమాట. రవితేజ ట్రిపుల్ రోల్స్‌లో కనిపించనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. సునీల్, లయ, అభిమన్యు సింగ్, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటిస్తోన్న ఈ సినిమాకు సంగీతం: తమన్.
Comments
Please login to add a commentAdd a comment