బాయ్ ఫ్రెండ్ తో ఇలియానా! | Don't miss Ileana D'Cruz's adorable pictures with boyfriend Andrew Kneebone | Sakshi
Sakshi News home page

బాయ్ ఫ్రెండ్ తో ఇలియానా!

Published Fri, Jun 17 2016 11:11 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

బాయ్ ఫ్రెండ్ తో ఇలియానా!

బాయ్ ఫ్రెండ్ తో ఇలియానా!

బిపాసాబసు బాటలోనే ఇలియానా పయనిస్తోందా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. కరణ్‌ గ్రోవర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇలియానా కూడా ఇప్పుడు ఇదే దారిలో నడుస్తున్నట్టు కనబడుతోంది. ఇప్పటివరకు తన ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచిన ఇలియానా తన ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో కలిసివున్న ఫొటోలను బయటపెట్టింది.

మొనాకోలో తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మొనాకో చాలా బాగుందని, ఇక్కడి అందాలను వర్ణించడానికి మాటల చాలవని పేర్కొంది. ఈ ఫొటోలు చూసినవాళ్లందరూ ఇలియానా తొందరలోనే పెళ్లిపీటలు ఎక్కడం ఖాయమని అంటున్నారు. అయితే పెళ్లి గురించి ఆమె మాత్రం ఏమీ చెప్పలేదు.

ప్రస్తుతం హిందీలో అక్షయ్‌కుమార్‌తో 'రుస్తూమ్' చిత్రంలో నటిస్తోంది. మంచి పాత్రలు వస్తే తప్పకుండా తెలుగులో నటిస్తానని ఇటీవల హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఇలియానా చెప్పింది. సినిమా కెరీర్ కు ఇప్పుడప్పుడే ముగింపు పలికే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement