Actress Ileana D Cruz Reaction To Rumors About Her Abortion And Suicide Attempt - Sakshi
Sakshi News home page

నేను సూసైడ్‌ చేసుకున్నా అన్నారు: ఇలియానా

May 2 2021 1:47 PM | Updated on May 2 2021 7:48 PM

Ileana D Cruz Gives Clarity On Abortion, Suicide Attempt - Sakshi

నిజానికి నాకు పనిమనిషి అంటూ ఎవరూ లేరు. నేను చచ్చిపోలేదు, బతికే ఉన్నాను...

తను గర్భవతిగా ఉన్న సమయంలో లేనిపోని రూమర్లు సృష్టించారని ఇలియానా వాపోయింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఫేక్‌ న్యూస్‌ గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించింది. "నా గురించి చాలా పుకార్లు వచ్చాయి. నేను అబార్షన్‌ చేసుకోబోతున్నానని చాటింపు చేశారు. అది విని నాకు బాధేసింది. మరీ ఇంత దారుణమా అనుకున్నా. ఇక ఇంకోసారి ఏకంగా నేను ఆత్మహత్యకు యత్నించానని, కాకపోతే నా పనిమనిషి చూసి ఈ ప్రయత్నాన్ని అడ్డుకుందని కథనాలు వచ్చాయి"

నిజానికి నాకు పనిమనిషి అంటూ ఎవరూ లేరు. అసలు నేనెప్పుడూ సూసైడ్‌ చేసుకోవడానికి ప్రయత్నించలేదు.. చచ్చిపోలేదు, బతికే ఉన్నాను. అయినా ఇలాంటి పిచ్చిపిచ్చి వార్తలు వారికి ఎక్కడ దొరుకుతాయో అర్థం కావడం లేదు" అని ఇలియానా పేర్కొంది. అంతే కాదు 2018లో తన బాయ్‌ ఫ్రెండ్‌ ఆండ్రూ నీబోన్‌తో కలిసి ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై మండిపడ్డ ఆమె తను గర్భవతిని కాదంటూ రూమర్లకు చెక్‌ పెట్టింది.

చదవండి: అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది: ఇలియానా

ప్లీజ్‌ అనిరుధ్‌ కోలుకోవాలని ప్రార్థించండి: నటి అభ్యర్థన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement