![Ileana D Cruz Fires On All Movie Industry Called Film Industry Is Cruel - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/31/ileana.gif.webp?itok=xyp3QN47)
ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్‌లో అగ్ర నటిగా రాణించిన ఇలియానా ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో వెండితెరకు దూరమైంది. తెలుగులో టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న క్రమంలోనే బాలీవుడ్‌కు మకాం మార్చింది ఇలియానా. అక్కడ ఆమె నటించిన సినిమాలన్ని సూపర్ హిట్ అయ్యాయి. అయినప్పటికీ ఇలియానాకు మాత్రం అవకాశాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఈ తరుణంలో ప్రముఖ ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్‌తో ప్రేమయాణం నడిపిన ఆమె అతనితో విడిపోయాక తిరిగి సినిమాలపై దృష్టి పెట్టింది. అయితే బాలీవుడ్‌కు వెళ్లిపోయాక ఇలియానా పలుమార్లు టాలీవుడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె భారత సినీ పరిశ్రమలపై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ అంటనే క్రూరమైందంటూ ఘాటుగా స్పందించింది.
‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా క్రూరమైనది. ఇక్కడ జీవించడం చాలా కష్టం. ప్రజలు చూసేంతవరకే మేం స్టార్లుగా ఉంటాం. ఒక్కసారి వాళ్లు మా నుంచి తల తిప్పుకుంటే అంతే ఇంకా మేము అన్నింటిని కోల్పోతాము. నా విషయంలో అదే జరిగింది’’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. చిత్ర పరిశ్రమ గురించి చెప్పడానికి ఎన్నో చెడ్డ విషయాలు ఉన్నాయని, అయితే ఇది డబ్బు సంపాదించే యంత్రమనే విషయాన్ని తాను ఒప్పుకోకతప్పదని చెప్పంది. అదే విధంగా ‘మా అభిరుచికి అనుగుణంగా పరిశ్రమలో ప్రతీదీ జరగాలనే నియమం లేదు. మన అనుమతి లేకుండా చాలా విషయాలు జరుగుతాయి. మనం వాటిని తట్టుకుని ఎలాంటి సంఘటనలను అయిన ఆస్వాదించడానికి ప్రయత్నించాలి. ఇక్కడ కష్టపడి పనిచేసేవారికి విలువ ఉండదు. ప్రజల ఫోకస్ ను బట్టే ఇక్కడ విలువ, కెరీర్ ఉంటుంది’ అని ఆమె తెలిపింది. కాగా ఆమె తనకు నచ్చని హీరోలా సినిమాలు అసలు చూడనని కూడా చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment