మై బెటరాఫ్‌! | Ileana D'Cruz on getting married: A little mystery is important | Sakshi
Sakshi News home page

మై బెటరాఫ్‌!

Published Wed, Oct 25 2017 12:16 AM | Last Updated on Wed, Oct 25 2017 2:45 AM

 Ileana D'Cruz on getting married: A little mystery is important

‘బెటరాఫ్‌’ అంటే ఏంటి? జీవితాన్ని పంచుకునే వ్యక్తి. పెళ్లయ్యాక భర్త గురించి భార్య చెబుతున్నప్పుడో... భార్య గురించి భర్త చెబుతున్నప్పుడో ‘నా బెటరాఫ్‌’ అని అంటుంటారు. ఇలియానా కూడా అదే అన్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇలియానా.. ఓ ఫొటోను ట్విట్టర్‌లో పెట్టారు. ‘మిమ్మల్ని నవ్వించే, ప్రేమించే స్నేహితులను వెతుక్కోండి’ అని ఆ ఫొటోను ఉద్దేశించి పేర్కొన్నారు. అంతవరకూ బాగానే ఉంది.. ‘నా బెటరాఫ్‌ ఆండ్రూ నీబోన్‌ తీసిన ఫొటో ఇది’ అనడం చర్చనీయాంశమైంది. ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా లవ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ‘మా మధ్య రిలేషన్‌షిప్‌ ఉన్న మాట నిజమే’ అని కూడా పలు సందర్భాల్లో ఇలియానా అన్నారు.

ఇద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు వచ్చినప్పుడల్లా ‘అదేం లేదు’ అంటూ వచ్చారు ఇలియానా. మరి, ఇప్పుడు ‘నా బెటరాఫ్‌’ అనడంలో ఆంతర్యం ఏంటి? ఆండ్రూ – ఇలియానా రహస్యంగా పెళ్లి చేసుకున్నారా? అనే చర్చ జరుగుతోంది. మరి.. ‘నా బెటరాఫ్‌’ అనడానికి అర్థం ఏంటో ఇలియానానే చెప్పాలి. మంచి స్నేహితులను కూడా ‘బెటరాఫ్‌’ అనొచ్చనీ, భార్యాభర్తలనే అనక్కర్లేదని చెప్పి ట్విస్ట్‌ ఇస్తారేమో?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement