
‘‘నా గురించి నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి నేను చాలా సంతోషంగా ఉంటున్నా’’ అంటున్నారు ఇలియానా. జీవనశైలిని కూడా మార్చుకున్నారట ఆమె. కొత్త జీవన విధానం గురించి ఇలియానా మాట్లాడుతూ– ‘‘మీపై మీరు శ్రద్ధ వహించండి. ఇది ఎవరైనా, ఎప్పుడైనా మొదలుపెట్టవచ్చు. ఇది జీవితం. ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు మనం ఇతరుల్ని నమ్మాల్సి రావొచ్చు.
ఆ సమయంలోవారిపై మనం బాగా ఆధారపడతాం. జీవితాంతం వారు మనతో ఉంటారో ఉండరో తెలియకుండానో వారిని నమ్మేస్తాం. కానీ మన గురించి మనం ఎప్పుడూ ఆలోచించుకుంటూనే ఉండాలి. మర్చిపోకూడదు. ఎందుకంటే జీవితంలో ఏం జరిగినా ఫస్ట్ మనకోసం ఉండేది మనమే. నా గురించి నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నప్పటి నుంచి మానసికంగా, శారీరకంగా హాయిగా ఉంటున్నాను’’ అని పేర్కొన్నారు ఇలియానా.
Comments
Please login to add a commentAdd a comment