ఇల్లిబేబి ఏంటి నీ లొల్లి..?! | Ileana D Cruz Trolled For Posting Glamorous Photos In Social Media | Sakshi
Sakshi News home page

ఇల్లిబేబి ఏంటి నీ లొల్లి..?!

Published Wed, Jan 30 2019 8:48 AM | Last Updated on Wed, Jan 30 2019 9:00 AM

Ileana D Cruz Trolled For Posting Glamorous Photos In Social Media - Sakshi

ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి.. లేకపోతే ఆ తరువాత ఎంత గగ్గోలు పెట్టినా పట్టించుకోరన్నది వాస్తవం. ఇప్పుడు నటి ఇలియానాది ఇదే పరిస్థితి. టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉండగానే బాలీవుడ్‌లో ప్రవేశించింది. అక్కడ ‘బర్ఫీ’ లాంటి ఒకటి, రెండు చిత్రాలు పేరు తెచ్చి పెట్టినా, ఆ తరువాత వరుస అపజయాలను ఎదుర్కొంది. దాంతో అవకాశాలు ముఖం చాటేస్తున్నాయి. మరో దారి లేక ప్రస్తుతం ఇలియానా దక్షిణాది చిత్రాలపై దృష్టి సారించింది.

రవితేజకు జోడిగా నటించిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ చిత్ర షూటింగ్‌ సమయంలో దక్షిణాదిలో కోల్పోయిన స్థానాన్ని మళ్లీ దక్కించుకుంటానని ధీమా వ్యక్తం చేసింది కూడా. అయితే ఆ చిత్రం ఇలియానా ఆశల్ని సమూలంగా కూల్చేసింది. దాంతో ఈ అమ్మడి పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఎలాగైన అవకాశాలు పొందాలన్న భావనతో ఉన్న ఇలియానా.. అందుకు గ్లామర్‌ను వాడుకోవాలని నిర్ణయించుకున్నట్లుంది. అందుకే శరీరంపై కనిపించీ కనిపించని దుస్తులు ధరించిన ఫొటోలను తన ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లలో పోస్ట్‌ చేసి సినీ వర్గాల దృష్టిని తన వైపునకు తిప్పుకునే పనిలో పడింది.

తాజాగా లోనెక్‌ జాకెట్‌ను మాత్రమే ధరించిన ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. ఆ ఫొటోలిప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే అవకాశాల కోసం మరి ఇంత దిగజారాల అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement