Ileana D Cruz: Teared Up A Teeny Tiny Bit Post Workout - Sakshi
Sakshi News home page

Ileana D Cruz: అత‌డు చెప్పిన‌ట్లు చేశా, అంతే.. ఇలియానా క‌న్నీరు!

Published Thu, Nov 18 2021 9:16 PM | Last Updated on Fri, Nov 19 2021 1:37 PM

Ileana D Cruz Teared Up A Teeny Tiny Bit Post Workout - Sakshi

Ileana D Cruz Gets Emotional: ఫిట్‌నెస్‌గా ఉండ‌టం కోసం తార‌లు ప‌డే తిప్ప‌లు అన్నీఇన్నీ కావు. ఒక‌పూట తిండి మ‌ర్చిపోతారేమోక కానీ వ‌ర్క‌వుట్ మాత్రం అస్స‌లు మిస్స‌వ‌రు. పొర‌పాటున వ్యాయామానికి కొంత బ్రేక్ ఇస్తే మాత్రం రెట్టింపు క‌ష్ట‌ప‌డుతూ వ‌ర్క‌వుట్స్ మొద‌లు పెడుతుంటారు. గోవా సొగ‌స‌రి ఇలియానా కూడా అంతే.. ఫిట్‌గా ఉండ‌టం కోసం ఏమైనా చేస్తుంది. తాజాగా వ‌ర్కవుట్ పూర్త‌యిన‌ త‌ర్వాత ఇలియానా ఎందుకో ఎమోష‌న‌ల్ అయింది.

ఫిట్‌నెస్ ట్రైన‌ర్ గురించి చెప్తూ క‌న్నీళ్లు పెట్టుకుంది. "నా రెండు చేతులతో నా శ‌రీరాన్ని హ‌త్తుకోమ‌న్నాడు ట్రైన‌ర్‌. నా కోసం నిరంత‌రం పని చేస్తున్న శ‌రీరానికి ఒక్క క్ష‌ణం థ్యాంక్స్ చెప్ప‌మ‌న్నాడు ఫిట్‌నెస్ ట్రైన‌ర్‌. అత‌డు చెప్పిన‌ట్లుగా నా బాడీని ఆలింగ‌నం చేసుకోగానే ఏదో తెలియ‌ని మ‌ధురానుభూతి న‌న్ను కుదిపేసింది. ఇదెంతో బాగుంది. దీన్ని మీరు కూడా ప్ర‌య‌త్నించండి, ఎలా ఫీల్ అవుతారో చూడండి" అని రాసుకొచ్చింది ఇలియానా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement