
ఈ చిన్నారి ఎవరో గుర్తపట్టారా? ఒకప్పుడు సౌత్‌లో తన అందం, అభినయంతో దక్షిణానా స్టార్ హీరోయిన్‌గా రాణించింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రభాస్ నుంచి యంగ్ హీరో రామ్ పోతినేని వరకు తెలుగు అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. జీన్స్,టీ-షర్ట్‌తో క్యూట్ క్యూట్‌గా ఫొటోకు ఫోజు ఇచ్చిన ఈ చిన్నారి ఎవరో ఇప్పటికైనా గుర్తొచ్చిందా. అయితే మరో క్లూ మీకోసం.
చదవండి: మహిళల పరువు పోయింది.. సమంత స్పెషల్ సాంగ్‌పై మాధవిలత షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం తనకు తెలుగులో ఆఫర్స్ లేకపోయిన ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అమాయకపు చూపులు, క్యూట్ స్మైల్, కవ్వించే వయ్యారంతో కుర్రాళ్ల గుండెల్లో నిలిచిపోయింది. ఈ మధ్య సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చిన ఈ భామ ఇటీవల తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు. దేవదాసు సినిమాతో సినీ తెరకు ప్రరిచయమైన గోవా బ్యూటీ ఇలియాన.
చదవండి: ‘పుష్ప’ మూవీకి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్
మొదటి సినిమాతోనే తన అందచందాలతో దర్శక-నిర్మాతల దృష్టి ఆకర్షించిన ఇలియాన.. ఆ తర్వాత వరసగా తెలుగు స్టార్ హీరోల సరసన నటించి బాక్సాఫీసు హిట్‌లు అందుకుంది.తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తోంది. ‘దేవదాసు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా.. ఆ తర్వాత ‘పోకిరి’, ‘జల్సా’, ‘కిక్’, ‘జులాయి’ లాంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ‘ది బిగ్ బుల్’ సినిమాతో ఓటీటీలోకి అడుగుపెట్టిన ఇలియానా.. ‘తేరా క్యా హోగా లవ్లీ’ అనే మూవీతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment