కుక్కునూరు: బస్సులో నుంచి చేతులు బయటకు పెట్దొద్దని ఆర్టీసీ సిబ్బంది పదేపదే హెచ్చరిస్తుంటారు.. అయినా అనేక మంది ప్రయాణికులు పట్టించుకోరు. ఇలా చేతులు బయట పెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. శుక్రవారం కుక్కునూరు మండలంలోని పెద్దరావిగూడెంలో దురదృష్టవశాత్తూ ఇటువంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలం డిపో నుంచి రాజమండ్రి వెళ్తున్న బస్సులో భద్రాచలం మండలంలోని కొర్రాజుల గుట్ట గ్రామానికి చెందిన యువకుడు రేబల్లి నాని(16) ప్రయాణిస్తున్నాడు.
ఇతను బస్సు కిటికి నుంచి చేతిని బయటకు పెట్టాడు. ఈ క్రమంలో కుక్కునూరు నుంచి భద్రాచలం వెళ్తున్న లారీ బస్సు పక్కగా వెళ్తూ నాని చేయిని ఢీకొంది. ఈ ప్రమాదంలో నాని చేయి విరగడంతో తోటి ప్రయాణికులు బస్సును నిలుపుదల చేయించారు. 108లో బాధితుడిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment