lorry crash
-
చేతులు బయటకు పెట్టొద్దన్నా..!
కుక్కునూరు: బస్సులో నుంచి చేతులు బయటకు పెట్దొద్దని ఆర్టీసీ సిబ్బంది పదేపదే హెచ్చరిస్తుంటారు.. అయినా అనేక మంది ప్రయాణికులు పట్టించుకోరు. ఇలా చేతులు బయట పెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. శుక్రవారం కుక్కునూరు మండలంలోని పెద్దరావిగూడెంలో దురదృష్టవశాత్తూ ఇటువంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలం డిపో నుంచి రాజమండ్రి వెళ్తున్న బస్సులో భద్రాచలం మండలంలోని కొర్రాజుల గుట్ట గ్రామానికి చెందిన యువకుడు రేబల్లి నాని(16) ప్రయాణిస్తున్నాడు. ఇతను బస్సు కిటికి నుంచి చేతిని బయటకు పెట్టాడు. ఈ క్రమంలో కుక్కునూరు నుంచి భద్రాచలం వెళ్తున్న లారీ బస్సు పక్కగా వెళ్తూ నాని చేయిని ఢీకొంది. ఈ ప్రమాదంలో నాని చేయి విరగడంతో తోటి ప్రయాణికులు బస్సును నిలుపుదల చేయించారు. 108లో బాధితుడిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
ఇద్దరి విద్యార్థులను బలిగొన్న లారీ
మరో యువకుడికి తీవ్రగాయాలు నుజ్జునుజ్జుయిన ద్విచక్రవాహనం ఆపకుండా వెళుతున్న లారీని పట్టుకున్న గ్రామస్తులు కాళ్లకల్ బంగారమ్మ దేవాలయం వద్ద ఘటన తూప్రాన్ : స్నేహితుడి పిలుపు మేరకు ఇంటిని ఖాళీ చేసేందుకు బైక్‌పై వెళుతున్న ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరిని అతి వేగంగా వచ్చి లారీ బలిగొంది. ఈ ప్రమాదంలో మరో యువకుడు గాయపడ్డాడు. ఈ విషాదకర సంఘటన మండలంలోని కాళ్లకల్ గ్రామ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ సంతోష్‌కుమార్ కథనం మేరకు.. శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన మల్లవరం లక్ష్మి, రవీందర్‌రెడ్డి దంపతుల కుమారుడు దినేష్‌రెడ్డి(20), పెరుమాళ్ల నరిసింహులు, సుశీల దంపతుల కుమారుడు శివగోపాల్ (20), సాయికిరణ్ (19)లు స్నేహితులు. వీరిలో దినేష్‌రెడ్డి, సాయికిరణ్‌లు ఐటీఐ చదువుతుండగా, శివగోపాల్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కాగా మరో మిత్రుడు శివ తన అన్నయ్య ఇంటిని ఖాళీ చేస్తున్నందున సామాన్లు సర్దేందుకు రావాలని కోరడంతో అతడి పిలుపు మేరకు పై ముగ్గురు బైక్‌పై మేడ్చల్ మండలం ఎల్లంపేటకు బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలోనే వీరు ప్రయాణిస్తున్న వాహనం మండలంలోని కాళ్లకల్‌లోని బంగారమ్మ దేవాలయం వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన రాజస్థాన్‌కు చెందిన లారీ ఢీకొంది. దీంతో ముగ్గురు యువకులు రహదారిపై పడ్డారు. ఈ ప్రమాదంలో దినేష్‌రెడ్డి తల పగిలి అక్కడిక్కడే దుర్మరణం చెందగా, శివగోపాల్ నడుంపై నుంచి లారీ చక్రం వెళ్లడంతో అతను కూడా ప్రాణాలొదిలాడు. సాయికిరణ్ మాత్రం తీవ్రంగాయాలతో బయట పడ్డాడు. అయితే బైక్‌ను ఢీకొన్న లారీ ఆపకుండా వెళ్లిపోతుండడంతో గమనించిన కాళ్లకల్ గ్రామానికి చెందిన యువకులు కారులో వెంబడించి పట్టుకున్నారు. తీవ్రగాయాలు అయిన సాయికిరణ్‌ను మేడ్చల్ 108లో బాలాజీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ సంతోష్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదే హాలను గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పారిపోవడానికి యత్నించిన లారీని అదుపులోకి తీసుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమేదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. అయితే ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందడం గ్రామంలో విషాదం అలుముకుంది. తోటి విద్యార్థులు మృతి చెందడంతో సహచరులు వారి ఫొటోలను ఫ్లెక్సీలు చేసి నినాదలు చేశారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ: ఇద్దరు మృతి
విజయనగరం: జిల్లాలోని ఇందిరానగర్ వద్ద ఎత్తురోడ్డు సమీపంలో సోమవారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. ఓ ఇంట్లోకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖ పోర్టు నుంచి రాయ్‌గఢ్ వెళ్తున్న కెమికల్ లోడ్ లారీ అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతులు విజయనగరం, కాకినాడకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ సహా క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
బైకును ఢీకొన్న లారీ
పామూరు, న్యూస్‌లైన్ : బైకుపై ఉన్న ముగ్గురిని మొద్దుల లోడుతో వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఓ వృద్ధురాలు స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ఘటన మండలంలోని బలిజపాలెం వద్ద గురువారం రాత్రి జరిగింది. వివరాలు.. పీసీపల్లి మండలం గుంటుపల్లికి చెందిన కొణి జేటి నవీన్(16) తన అమ్మమ్మ సాతులూరి చెన్నమ్మను ఆమె స్వగ్రామం గుంటూరు లింగన్నపాలెం (వయా బొట్లగూడూరు)లో వదిలి వచ్చేందుకు బయల్దేరాడు. అమ్మమ్మతో కలిసి వాహనం కోసం రోడ్డుపై వేచి ఉన్నాడు. అదే మండలం శంకరాపురాని (మూలవారిపల్లి)కి చెందిన చింతగుంట్ల సీమోను (22) బొట్లగూడూరు వైపునకు బైకుపై వెళ్తున్నాడు. తమను బొట్లగూడూరులో వదలి పెట్టాలని నవీన్, చెన్నమ్మలు కోరడంతో వారిని మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని బోట్లగూడూరు వెళ్తున్నాడు. బొట్లగూడూరు నుంచి శంకరాపురం వైపు మొద్దుల లోడుతో ఎదురుగా వచ్చిన లారీ మోటార్‌సైకిల్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో నవీన్, చింతగుంట్ల సీమోనులు అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్ అమ్మమ్మ చెన్నమ్మకు స్వల్పగాయాలయ్యాయి. కళ్లముందే తన మనుమడి మృతిని తట్టుకోలేని చెన్నమ్మ స్పృహకోల్పోయింది. నవీన్ గుంటుపల్లి హైస్కూల్లో 10 వ తరగతి చదువుతున్నాడు. సీమోను బేల్దారి కూలి. ఐదు నెలల క్రితమే ఇతనికి దేవి అనే మహిళతో వివాహమైంది. మృతుల బంధువుల ఆర్తనాదాలతో సంఘటన స్థలం మార్మోగింది.