ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, మైసూరు (కర్ణాటక): పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న మహిళ, యువకుని ప్రేమాయణంపై గ్రామపెద్దలు కన్నెర్రజేశారు. ఆమెను మందలించి, ప్రియునికి దేహశుద్ధి గావించారు. నంజనగూడు తాలూకాలోని హళ్ళిదిట్టి గ్రామంలో ఇది జరిగింది. కొంతెగాల గ్రామానికి చెందిన మహేష్ కుమార్, పొరుగున మసగే గ్రామానికి చెందిన యువతి పీయూసీలో ఉన్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇది తెలిసి ఆమె తల్లిదండ్రులు మరో హళ్లిదిడ్డికి చెందిన యువకునితో పెళ్లి జరిపించారు.
భర్తతో కలిసి సంసారం చేసి ఇద్దరు పిల్లలున్న ఆమె ప్రియున్ని మరిచిపోలేదు. అతడూ తరచూ ఆమె ఇంటికి చాటుగా వచ్చి వెళ్తుండేవాడు. దాంతో మహిళ భర్తకు ఈ విషయం తెలిసి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. ఇంతలో గురువారంనాడు గ్రామానికి వచ్చిన మహేష్ ఆ మహిళ ఇంట్లోకి వెళ్లగానే పెద్దలు, గ్రామస్తులు పట్టుకుని కొట్టి బుద్ధిమాటలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment