wife kills her husband
-
మేనకోడలిపై మోహంతో భార్యపై వేధింపులు.. చివరికి ఏమైందంటే?
లక్నో: యూపీలోని బుడౌన్ బుడౌన్లో ఓ మహిళా దారుణానికి ఒడిగటింది. తాగొచ్చి తన మేనకోడలిని లొంగదీసుకునే ప్రయత్నిస్తూ తనని తరచూ వేదిస్తున్నందుకు అతడి భార్య మిథ్లేశ్ దేవి(40) భర్త గొంతు కోసి చంపేసింది. కేసు దర్యాప్తు చేసిన యూపీ పోలీసులు చాకచక్యంగా అసలు నిజాన్ని రాబట్టారు. బుడౌన్లో ఆట వస్తువులను తయారు చేసే తేజేంద్ర సింగ్(43) ఆగస్టు 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బిల్సి పట్టణంలోని తన ఇంటి ప్రాంగణంలో నిద్రిస్తున్న తేజేంద్ర సింగ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసిన కుటుంబ సభ్యులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొదటి నుంచి తేజేంద్ర సింగ్ భార్య తడబడుతూ ఒకదానితో ఒకటి పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో అనుమానమొచ్చిందని తర్వాత ఆమెను విడిగా విచారణ చేయగా హత్య తానే చేసినట్లు అంగీకరించిందని తెలిపారు. తన మేనకోడలిని లొంగదీసుకోవడానికి తేజేంద్ర ప్రయత్నించేవాడని తనని ఒప్పించమని తరచూ వేధించేవాడని భర్త వేధింపుల నుండి విముక్తి పొందాలని ఎప్పటినుంచో అవకాశం కోసం ఎదురు చూస్తుండగా ఓ రోజు అతడు బాగా మద్యం సేవించి రావడంతో నిద్రిస్తున్న సమయంలో కొడవలితో గొంతు కోసి చంపినట్లు మిథ్లేశ్ దేవి నేరాన్ని అంగీకరించిందని వివరించారు బుడౌన్ ఎస్పీ ఓపీ సింగ్. ఇది కూడా చదవండి: HYD: మద్యం మత్తులో సీఐ కారు బీభత్సం.. -
భార్యపై అనుమానం.. అర్ధరాత్రి దారుణం
చిక్కబళ్లాపురం: భార్యపై అనుమానంతో ఆమెను కిరాతకంగా హత్య చేశాడో భర్త. చిక్కబళ్లాపురంలోని కొరచరపేటెలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ మిథున్కుమార్ వివరాలను వెల్లడించారు. అయితే, అరవింద్, భార్య మమత (30) భార్యభర్తలు. వీరికి ఇద్దరు మగ పిల్లలున్నారు. కాగా, అరవింద్ పానీపూరి షాపులో పనిచేసేవాడు. ఇతడు భార్యపై అనుమానంతో తరచూ రగడపడేవాడు. శనివారం అర్ధరాత్రి కూడా భార్యతో గొడవపెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఆమె తలను నేలకేసి పదేపదే కొట్టాడు. దీంతో నోట్లో నుంచి, చెవుల్లో నుంచి రక్తం కారి ఆమె మృత్యువాత పడింది. గొడవ విషయం తెలిసి పోలీసులు చేరుకుని నిందితున్ని పట్టుకున్నారు. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో వారి పిల్లలిద్దరూ దిక్కులేనివారయ్యారు. ఇది కూడా చదవండి: తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న ఏం చేశాడంటే..? -
పాలమూరు జిల్లాలో దారుణం
మహబూబ్నగర్ : పాలమూరు జిల్లాలో దారుణం జరిగింది. భర్తపై భార్య కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన కోడూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో భర్త రాము మృతిచెందాడు. గంగమ్మ బుధవారం ఉదయం భర్తపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. దీంతో రాము అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గంగమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాముకు గంగమ్మతో కొంతకాలంగా కుటుంబ కలహాలు నెలకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.