![శివనారాయణపురంలోని ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటం చేస్తున్న యువతి - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/20/19nspmog02-290026_mr_1.jpg.webp?itok=7Pq95X1V)
శివనారాయణపురంలోని ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటం చేస్తున్న యువతి
మొగల్తూరు: పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసగించిన ప్రియుడి ఇంటి ముందు బాధిత యువతి బుధవారం మౌనపోరాటానికి దిగింది. బాధిత యువతి మాట్లాడుతూ శ్రీరాంపురం పంచాయతీ శివనారాయణపురానికి చెందిన కొండేటి సాయి తాను నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామన్నారు. తనను వివాహం చేసుకోవాలని కోరగా తాను అగ్ర కులానికి చెందిన వాడినిని తమ ఇంట్లో పెళ్ళికి అంగీకరించరని నిరాకరించాడని తెలిపింది.
తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని తెలిపింది. ఆమె పోరాటానికి మాలమహానాడు అధ్యక్షుడు నల్లి రాజేష్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తెన్నేటి కిశోర్‌లు మాట్లాడుతూ దళిత బిడ్డకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. అయితే ఈ ఘటనపై రూరల్ సీఐ సురేష్ బాబు బుధవారం రాత్రి విలేకరుల సమావేశం ఏర్పాట్లు చేశారు. యువతి తమకు ఇంకా ఫిర్యాదు చేయలేదని, అన్యాయం జరిగినట్లు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment