![Wife Beaten Her Husband For Second Marriage At Manthani - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/17/manthani.jpg.webp?itok=Uv3JyzZs)
సాక్షి, పెద్దపల్లి: తన భర్త రెండో వివాహం చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న భార్య.. అతడికి దేహశుద్ధి చేసింది. భర్తను ఓ కరెంట్ స్థంభానికి కట్టేసి చితకబాదింది. చెప్పుల దండ మెడలో వేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ షాకింగ్ ఘటన మంథనిలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. మంథని మండలం స్వర్ణపల్లి గ్రామానికి చెందిన అఖిలను శ్రీకాంత్ రెడ్డి వివాహం చేస్తున్నాడు. నాలుగేళ్ల కిందట వీరికి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో అఖిల పేరెంట్స్ శ్రీకాంత్ రెడ్డికి కట్నంగా 20 లక్షలు ఇచ్చారు. అయితే, వీరిద్దరికీ కొడుకు జన్మించిన అనంతరం.. శ్రీకాంత్ భార్యను వదిలిపెట్టి వెళ్లాడు.
అనంతరం, వరంగల్‌లో మరో మహిళను వివాహం చేసుకున్నట్టు తెలుసుకున్న అఖిల.. కుటుంబ సభ్యుల సాయంతో శ్రీకాంత్ రెడ్డిని హన్మకొండ నుంచి స్వర్ణపల్లికి తీసుకువచ్చారు. అనంతరం, శ్రీకాంత్‌ను కరెంట్ పోల్‌కు కట్టేసి.. భార్య అతడిని చితకబాదింది. చెప్పులతో కొట్టింది. ఈ క్రమంలో చెప్పుల దండ మెడలో వేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment