
తిరువొత్తియూరు: అరియలూరు జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న జంట తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించింది. పుదుకోటై జిల్లా కీరనూర్ ఎలిల్ నగర్‌కు చెందిన సేటు కుమారుడు ముత్తు ముహమ్మద్ (28) సెల్‌ఫోన్ సర్వీసు దుకాణం నడుపుతున్నాడు. తిరుపూర్ మన్నర్ బీవీనగర్‌కు చెందిన రాజారామ్ కుమార్తె దివ్యభారతి (21) తిరుపూర్‌లోని ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ చదువుతోంది.
ఐదేళ్లుగా ముత్తు మహమ్మద్, దివ్యభారతి ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు వ్యతిరేకత తెలపడంతో ఈ నెల 26వ తేదీ నాగూర్ దర్గాలో వివాహం చేసుకున్నారు. అక్కడే వివాహ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ జయంకొండం మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసులు వారి తల్లిదండ్రులను రప్పించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment