
మాదాపూర్: తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి నగరంలోని కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గంచెరువులోకి దూకి గల్లంతైన ఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక గుల్బర్గా చించోలిలోని సాధిపూరకు చెందిన పాయల్ (20) 6 నెలల క్రితం నగరానికి వచ్చి మాదాపూర్‌లోని డీమార్ట్ వద్ద స్నేహితురాలితో కలిసి ఉంటోంది.
తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పగా.. ఇందుకు ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన పాయల్ కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకింది. డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం రాత్రి వరకూ ఆమె ఆచూకీ లభించలేదు.
Comments
Please login to add a commentAdd a comment