Senior Actress Jayamalini Reveals About Her Love Story With Star Actor, Deets Inside - Sakshi
Sakshi News home page

Senior Actress Jayamalini: నేను చనిపోయేలోపు ఆయనను కలిసి నా ప్రేమ విషయం చెబుతా: నటి జయమాలిని

Published Tue, Jan 17 2023 3:36 PM | Last Updated on Tue, Jan 17 2023 4:05 PM

Senior Actress Jayamalini About Her Love Story With Star Hero - Sakshi

సీనియర్‌ నటి జయమాలిని.. నిన్నటి తరం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు స్టార్‌ హీరోలందరి సరసన స్పెషల్‌ సాంగ్‌లో నటించి అలరించారు. అలనాటి నటి, డాన్సర్‌ జ్యోతిలక్ష్మి సోదరిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆమె తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో జయమాలిని అప్పట్లో మంచి క్రేజ్‌ ఉండేది. బెసిగ్గా సినిమాల్లో డాన్సర్‌ అయిన ఆమె స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు.  దాదాపు రెండు దశబ్దాలకు పైగా వెండితెరపై డాన్సర్‌గా అలరించిన ఆమె ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నారు. 

చదవండి: పవన్‌ కల్యాణ్‌తో అసలు నటించను! ఎందుకంటే.: హీరోయిన్‌

ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్‌ చానళ్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తిర విషయాన్ని బయట పెట్టింది. ఇండస్ట్రీలో తనకు చాలామంది ప్రపోజ్‌ చేశారని చెప్పారు. ‘అప్పట్లో నాకు చాలా మంది ప్రపోజ్‌ చేశారు. పెళ్లి కూడా చేసుకుంట అని వెంటపడ్డారు. ఇక నాకు వచ్చే లవ్‌ లెటర్స్‌ చూడటానికి ప్రత్యేకంగా ఒక మేనేజర్‌ ఉండేవారు. ఇంక కొందరైతే బ్లడ్‌తో రాసేవారు. ఓ మిలిటరి ఆఫీసర్‌ కూడా నాకు లవ్‌ లెటర్‌ రాశారు. పెళ్లి గురించి మా అమ్మ-నాన్నతో కూడా మాట్లాడతా అన్నారు.

ఇంక కొందరు మాత్రం మా అమ్మను అడిగే ధైర్యం లేక మా అక్క(జ్యోతి లక్ష్మితో చెప్పి ఒప్పించే ప్రయత్నం చేసేవారు’ అంటూ నాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు.  ఇక తన వెంట అంత మంది పడితే తాను మాత్రం ఓ స్టార్‌ హీరోని ప్రేమించానంటూ సీక్రెట్‌ బయటపెట్టారు. ‘నేను ఓ స్టార్‌ హీరోను ప్రేమించాను. ఆయన కూడా నన్ను ప్రేమించారు. కానీ ఇద్దరం బయటక పడలేదు. ఫస్ట్‌ ఆయన లవ్‌ చేశారు. ఓ సారి షూటింగ్‌లో రాత్రి నా దగ్గరి వచ్చి చెప్పడానికి చూశారు. 

చదవండి: భారత ఆటగాళ్లతో తారక్‌ సందడి, ఫొటో వైరల్‌!

కానీ ధైర్యం లేక గొంతు సవరించి చెప్పకుండానే వెళ్లిపోయారు. నేను కూడా ధైర్యం లేక ఈ విషయం ఆయనకు ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ నాది రియల్‌ లవ్‌. నాకు వయసై చనిపోయేలోపు ఆ హీరో కలిసి ఈ విషయం చెబుతాను. ఆయన ఇప్పటికి బతికే ఉన్నారు. ఆయనకు పెళ్లయింది, భార్య పిల్లలు కూడా ఉన్నారు’ అని ఆమె చెప్పుకొచ్చారు. కానీ ఆ హీరో ఎవరూ, ఏ భాషకు చెందినవారనేది మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు. అయితే తనకు పెళ్లయిందని, తన భర్త తనని బాగా చూసుకుంటారని ఆమె పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement