మలేషియా యువతిని మోసం చేసిన యువకుడి అరెస్టు  | - | Sakshi
Sakshi News home page

మలేషియా యువతిని మోసం చేసిన యువకుడి అరెస్టు 

Published Sun, Oct 22 2023 12:50 AM | Last Updated on Sun, Oct 22 2023 10:01 AM

- - Sakshi

నాగజ్యోతి తరచూ ఇండియాకు వచ్చి చైన్నెలో తిరుమలై కృష్ణన్‌ను కలిసేది.

తిరుత్తణి: ప్రేమ పేరుతో విదేశీ యువతిని మోసం చేసిన యువకుడిని తిరుత్తణి పోలీసులు అరెస్టు చేశారు. భగవతాపురం గ్రామానికి చెందిన వెంకట కుప్పరాజు కుమారుడు తిరుమలై కృష్ణన్‌ (28) బెంగళూరులో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి మలేషియాకు చెందిన నాగజ్యోతి అనే యువతితో సోషల్‌ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరూ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ద్వారా మిత్రులయ్యారు. కొద్దికాలానికి ప్రేమికులుగా మారారు.

ఫలితంగా నాగజ్యోతి తరచూ ఇండియాకు వచ్చి చైన్నెలో తిరుమలై కృష్ణన్‌ను కలిసేది. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. తనకు వేరొక యువతితో నిశ్చితార్థం జరిగిందని ఇకపై తనతో టచ్‌లో వద్దని తిరుమలై కృష్ణన్‌ చెప్పడంతో నాగజ్యోతి మలేషియా నుంచి తిరుత్తణి చేరుకుంది. తనను వివాహం చేసుకోవాలని నిలదీసింది. హత్యా బెదిరింపులకు పాల్పడడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ రాఖీకుమారి కేసు నమోదు చేసి తిరుమలై కృష్ణన్‌ను అరెస్టు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement