ప్రేమ విఫలం.. మనసు కలత చెంది.. | Young Woman Commits Suicide By Lying On The Railway Track Due To Love Failure In Karimnagar - Sakshi
Sakshi News home page

Karimnagar: రైలుకు ఎదురుగా నిలబడి... యువతి ఆత్మహత్య

Published Tue, Oct 10 2023 12:44 AM | Last Updated on Tue, Oct 10 2023 1:56 PM

- - Sakshi

రామగుండం: ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం యువకుడి, యువతి మధ్య ప్రేమగా మారింది. అయితే, తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో యువకుడు తిరస్కరించాడు. దీంతో మనస్తాపం చెందిన కల్వల శార్వాణి(20) సోమవారం అతివేగంగా వస్తున్న రైలు ఎదుట పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకుంది. జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి గంగారపు తిరుపతి కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అశోక్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ కల్వల ప్రదీప్‌కుమార్‌ కూతురు శార్వాణికి రెండేళ్ల క్రితం ఏపీలోని తిరుపతికి చెందిన యువకుడు గంగాధర్‌తో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది.

అదికాస్త ప్రేమగా మారింది. దీంతో రెండేళ్లుగా ఇద్దరూ చాటింగ్‌ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని గంగాధర్‌ను కోరింది. అయితే, తనకు ఇప్పటికే వివాహమైందని, పెళ్లి చేసుకోవడం కుదరదని ఆ యువకుడు తిరస్కరించాడు. తీవ్రమనస్తాపం చెందిన శార్వాని.. సోమవారం ఆ యువకుడితో ఫోన్‌లో మాట్లాడుకుంటూనే.. రామగుండం రైల్వేస్టేషన్‌లోకి చేరుకుంది.

వేగంగా వస్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైలును చూసి పట్టాలపై పడుకొని ఆత్మహత్య చేసుకుంది. శార్వాణి ఎన్టీపీసీలోని హోండా షోరూంలో ఉద్యోగిగా పనిచేస్తోంది. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయ్యాక కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు జీఆర్పీ ఔట్‌పోస్ట్‌ ఇన్‌చార్జి వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement