woman sucide
-
ప్రేమ విఫలం.. మనసు కలత చెంది..
రామగుండం: ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం యువకుడి, యువతి మధ్య ప్రేమగా మారింది. అయితే, తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో యువకుడు తిరస్కరించాడు. దీంతో మనస్తాపం చెందిన కల్వల శార్వాణి(20) సోమవారం అతివేగంగా వస్తున్న రైలు ఎదుట పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకుంది. జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్చార్జి గంగారపు తిరుపతి కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అశోక్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ కల్వల ప్రదీప్‌కుమార్ కూతురు శార్వాణికి రెండేళ్ల క్రితం ఏపీలోని తిరుపతికి చెందిన యువకుడు గంగాధర్‌తో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. దీంతో రెండేళ్లుగా ఇద్దరూ చాటింగ్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని గంగాధర్‌ను కోరింది. అయితే, తనకు ఇప్పటికే వివాహమైందని, పెళ్లి చేసుకోవడం కుదరదని ఆ యువకుడు తిరస్కరించాడు. తీవ్రమనస్తాపం చెందిన శార్వాని.. సోమవారం ఆ యువకుడితో ఫోన్లో మాట్లాడుకుంటూనే.. రామగుండం రైల్వేస్టేషన్‌లోకి చేరుకుంది. వేగంగా వస్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలును చూసి పట్టాలపై పడుకొని ఆత్మహత్య చేసుకుంది. శార్వాణి ఎన్టీపీసీలోని హోండా షోరూంలో ఉద్యోగిగా పనిచేస్తోంది. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయ్యాక కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు జీఆర్పీ ఔట్‌పోస్ట్ ఇన్చార్జి వివరించారు. -
నాకు బతకాలని లేదు. ఎంత ఆలోచించినా ప్రయోజనం లేకపోవడంతో...
కొత్తవలస: మండల కేంద్రంలోని వసంత్ విహార్ కాలనీ సమీపంలో గల జీఎస్ఎన్ రాజునగర్లోని ఒక అపార్ట్మెంట్లో శుక్రవారం ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి మృతురాలి కుటుంబసభ్యులు, సీఐ వి.చంద్రశేఖర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ సమీపంలోని కొయ్యూరు మండలం, ముదునూరు గ్రామానికి చెందిన కె.రాజేష్‌చౌదరి వేపాడ మండలం సోంపురం సమీపంలో క్వారీని లీజ్‌కు తీసుకుని నడుపుతున్నాడు. భార్య పద్మజ, నాలుగు సంవత్సరాల కూతురు జస్వితాచౌదరి, తల్లిదండ్రులతో కలిసి జీఎస్ఎన్ రాజు నగర్లో అపార్ట్మెంట్లో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం రాజేష్ చౌదరి బ్యాంకు పని నిమిత్తం విశాఖలోని ఎన్ఏడీ కొత్తరోడ్డు వెళ్లగా అపార్ట్మెంట్లోని పై అంతస్తులో తెలిసిన వారింటికి రాజేష్ చౌదరి తల్లిదండ్రులు, కూతురు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. అదే సమయంలో రాజేష్ చౌదరి భార్య పద్మజ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నాలుగేళ్ల కూతురు వచ్చి ఎంతసేపు తలుపు తట్టినా తీయకపోవడంతో పై అంతస్తులో ఉన్న నాన్నమ్మ, తాతయ్యల దగ్గరకు ఏడ్చుకుంటూ వెళ్లి చెప్పింది. దీంతో వారు వచ్చి తలుపు తట్టినా తీయకపోవడంతో విరగ్గొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కోడలు పద్మజ కనిపించడంతో హతాశులయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ ఆర్.గోవిందరావు, సీఐ వి.చంద్రశేఖర్, ఎస్సై బొడ్డు దేవిలు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విజయనగరం నుంచి వచ్చిన క్లూస్‌టీమ్ ఘటనా స్థలంలో వేలిముద్రలను, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ‘నాకు బతకాలని లేదు. ఎంత ఆలోచించినా ప్రయోజనం లేకపోవడంతో చనిపోతున్నాను. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. చిట్టితల్లీ జాగ్రత్త, గాడ్బ్లస్యూ’ అంటూ రాసిన సూసైడ్ లెటర్‌ను మృతదేహం పక్కన లభ్యం కావడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రమాదవశాత్తు కిందపడి గర్భిణి మృతి
హఫీజ్‌పేట్ : రెండో అంతస్థుపై నుంచి కిందపడి ప్రమాదవశాత్తు గర్భిణి మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ పాలవెల్లి తెలిపిన ప్రకారం.. లింగంపల్లి గ్రామంలోని వెంకట్‌రెడ్డి కాలనీకి చెందిన వెంకట్‌రెడ్డి అన్న కూతురు శ్రీనిఖకు గతేడాది డిసెంబర్లో వివాహమైంది. ఆమె ఇప్పుడు ఐదు నెలల గర్భిణి. కాగా రెండు రోజుల క్రితం కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో చెకప్ కోసం తన బాబాయ్ ఇంటికి వచ్చింది. వీరు మూడంతస్తుల భవనంలోని రెండవ అంతస్తులో ఉంటున్నారు. గురువారం ఉదయం 7.10 గంటలకు శ్రీనిఖ నిద్రలేచి బాల్కనిలోకి వచ్చి వాకింగ్ చేసింది. కొద్దిసేపటికి కళ్లు తిరుగుతున్నాయని చెప్పగా ఆమె పిన్ని ఇంట్లోకి వెళ్లమని సూచించి కిందకు దిగింది. ఇంతలోనే శ్రీనిఖ పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు వెంటనే మదీనాగూడలోని శ్రీకర ఆసుప్రతికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని చందానగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్తాప్తు చేస్తున్నారు. -
వేరే మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్య సహించలేక..
మండ్య(కర్ణాటక): ప్రేమించి పెళ్లి చేసుకుంది, కానీ కుటుంబ కలహాలను తాళలేక డెత్‌నోట్ రాసి బిడ్డతో కలసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నాగమంగల తాలూకా కెంచెగౌడనకొప్పలో సోమవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. మాజీ జడ్పీ సభ్యుడు దొరెస్వామి– సునంద దంపతుల కుమార్తె బిందు, నాగమంగల కుంభార వీధి నివాసి నవీన్ నాలుగేళ్ల క్రితం ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. చదవండి: బీచ్‌లో లైంగిక దాడి.. ఆ వీడియోని పదే పదే చూపిస్తూ.. మొదట్లో దంపతులు అన్యోన్యంగా మెలిగే వారు. కానీ కాలం గడిచే కొద్దీ ఇద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు ప్రారంభమయ్యాయి. వీటికి తోడు బిందును అత్త, మామ, ఆడపడుచులు వేధించడం మొదలైంది. ఇక భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఇక సహించలేక బిందు తన పది నెలల కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా తరచూ ఫోన్లో గొడవపడుతూ ఉండేవారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన బిందు శిశువుకు ఉరి వేసి తరువాత తానూ అదే వైరుతో ఉరి వేసుకుంది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసింది. తన చావుకు భర్త నవీన్, అత్త, మామ, ఆడపడుచు కారణమని పేర్కొంది. నాగమంగల పోలీసులు పరిశీలించి ఇరువురి మృతదేహాలను పట్టణంలోని ప్రజా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. బిందు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
వరకట్నం సమయానికి చెల్లించలేదని
లక్నో: మహిళలపై వేధింపులు, అకృత్యాలను నిరోధించడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కొందరు కేటుగాళ్లలో మార్పులు రావడం లేదు. తాజాగా, వరకట్న దాహనికి ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ ఘటన యూపీలోని కేడీ గ్రామంలో గత బుధవారం చోటుచేసుకుంది. ఖుష్బు అనే యువతికి సమీప గ్రామంలోని యూనస్‌తో వివాహం నిశ్చయమైంది. వీరి వివాహం వచ్చే నెల ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. ఈ క్రమంలో వరుడు తరపు వారు పెళ్లికి ముందే.. కట్నంగా 5 లక్షల నగదు, ఒక కారును ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, వధువు తరపువారు మొదట అడిగిన కట్నానికి అంగీకరించినప్పటికీ, సమయానికి కట్నం ఇవ్వలేకపోయారు. దీంతో వరుడు తరపు వారు పెళ్లి వేడుకకు అభ్యంతరం తెలిపారు. దీంతో ఖుష్బు తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: యూపీలో బీజేపీకి భారీ షాక్.. పార్టీని వీడిన మూడో మంత్రి -
Disha App: ప్రాణాలు కాపాడిన ‘దిశ’
-
భర్త వివాహేతర సంబంధం: నవవధువు అనుమానాస్పద మృతి
టీ.నగర్: తంజావూరు సమీపంలో ఉన్న తిరుకాట్టుపల్లి వేలంగుడికి చెందిన కల్యాణసుందరం చిన్న కుమార్తె భువనేశ్వరి (25)ను ఆర్కాడ్‌కు చెందిన కలియమూర్తి కుమారుడు రంగరాజ్ (30)తో ఏడాది క్రితం వివాహం అయింది. ఈ దంపతులు తిరుకాట్టుపల్లిలో కాపురం ఉంటున్నారు. మంగళవారం ఇంట్లో భువనేశ్వరి ఉరేసుకున్న స్థితిలో శవమై వేలాడుతూ కనిపించింది. తన కుమార్తె మృతి పట్ల అనుమానం ఉన్నట్లు కల్యాణసుందరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహమైనప్పటి నుంచి అల్లుడు రంగరాజ్, అతని తండ్రి కలియమూర్తి, తల్లి సుమతి వరకట్నం కోసం వేధింపులకు గురి చేశారని, అల్లుడికి వేరొక యువతితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిపారు. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసుస్టేషన్ ఎదుట బంధువులు బైఠాయించి ఆందోళన జరిపారు. దీని గురించి తిరువయ్యారు డీఎస్పీ సబీవుల్లా, ఇన్స్పెక్టర్ శ్రీదేవి కేసు నమోదు చేసి విచారణ జరిపారు. రంగరాజ్‌ను పోలీసులు అరెస్టు చేసి భువనేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. చదవండి: లాయర్ సూసైడ్ నోట్‌తో వెలుగులోకి యోగా టీచర్ హత్య -
ఆ సంఘటన కలచివేసింది: వర్మ
సాక్షి, హైదరాబాద్: సమాజంలో జరిగే విషయాల మీద నిత్యం ఫోకస్ పెట్టి, వివాదాస్పద అంశాలను ఆధారంగా చేసుకొని దానికి తనదైన ఫిక్షన్ జోడించి ఆసక్తికరమైన సినిమాలు తీయడంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ సిద్ధహస్తుడు. నిత్యం సంచలనాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ఆయన ఏది చేసినా అది సంచలనమవుతూ ఉంటుంది. చదవండి: పంజాగుట్ట పీఎస్ ఎదుట నిప్పంటించుకున్న మహిళ చదవండి: లోకేశ్వరి ఆత్మహత్య కేసులో ముమ్మర దర్యాప్తు తాజాగా ఆయన తన ట్విటర్ అకౌంట్లో ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. దిశ హత్యాచారాన్ని మరువక ముందే ఓ మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదురుగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న భయానక సంఘటనను గురించి తెలుసుకుని తన హృదయం ద్రవించిందని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇటువంటి వాటికి కఠినమైన సమాధానాలు వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా ఆయన చేసిన ఈ ట్వీట్‌కు సమాధానంగా ఆర్జీవీ సున్నితమైన అంశాలను కూడా అర్థం చేసుకోగలడు అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. Within days of the horrifying crime of DISHA’S rape and murder it’s even more horrifying that a woman burned herself to death at punjagutta police station ..Need to demand some hard answers from all concerned — Ram Gopal Varma (@RGVzoomin) January 6, 2020 చదవండి: ఏపీ రాజధానిపై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ చదవండి: వర్మకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన కేఏ పాల్ -
వంట బాగా చేయలేదన్నాడని..
అనంతగిరి: వంట బాగా చేయడంలేదని భర్త అనడంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కామారెడ్డిగూడకు చెందిన రాఘవేంద్రచారికి కర్ణాటకలోని సేడం తాలూకా ఆర్కి గ్రామానికి చెందిన కవితతో రెండేళ్ల కిందట వివాహమైంది. ఈనెల 1న భర్త ‘నీవు వంట బాగా చేస్తలేదు’అని భార్యకు చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె మరుసటి రోజు తెల్లవారుజామున ఇంట్లోనే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన కుటుంబసభ్యులు కవితను చికిత్స నిమిత్తం వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్.ఐ లక్ష్మయ్య తెలిపారు. మృతురాలు కవిత 45 రోజుల కిందట మగబిడ్డకు జన్మనిచ్చింది. వీరి వివాహమై రెండేళ్లవుతోంది. భార్యాభర్తలు బాగానే సంసారం చేస్తున్నారని, దసరా పండుగ నుంచి కవిత మానసిక స్థితి సరిగా లేదని తల్లిదండ్రులు, ఆమె బంధువులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. -
పెళ్లై నెల కాకముందే..
సాక్షి, ఒంటిమిట్ట : మండల పరిధిలోని కొత్తమాధవరంలో బుధవారం యువరాణి (19) అనే నూతన వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒంటిమిట్ట పోలీసు స్టేషన్ రైటర్ ముజీర్ తెలిపిన వివరాల మేరకు.. గతనెల 9వ తేదీన ఈమెకు సిద్దవటం మండలం గొల్లపల్లెకు చెందిన మేనేమామ గుర్రయ్యతో వివాహమైంది. మూడు రోజుల క్రితం ఆమె కొత్తమాధవరంలో నివాసం ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. బుధవారం తల్లిదండ్రులు పనిమీద కడపకు వెళ్లి తిరిగి వచ్చే సరికి ఆమె ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుంది. కాళ్లపారాణి ఆరకనే తమ బిడ్డ దూరమైందని తల్లిదండ్రులు బోరున విలపించారు. ఎస్ఐ అశ్విని మృతదేహాన్ని పీఎం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెళ్లై నెల కాకముందే ఏం జరిగింది ? పెళ్లి అయ్యి సరిగ్గా నెల కూడా కాలేదు.. యువరాణి ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. భర్త మాత్రం మా మధ్య ఎటువంటి సమస్యలు లేవంటున్నారు. యువరాణి తల్లిదండ్రులు తమ కుమార్తె చాలా మంచిదని చెబుతున్నారు. అంత్తింట్లో, పుట్టింట్లో ఏ సమస్యలు లేకున్నా ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుదో అర్థం కావడం లేదని బంధువుల పేర్కొంటున్నారు. -
జీపీఎస్ ట్రాకింగ్‌తో భార్యను వెంటాడి..
బెంగళూరు: కారులో అధునాత జీపీఎస్ ట్రాకింగ్ డివైజ్‌ను ఉంచి భార్యను వెంటాడాడు. సరిగ్గా ఆమె తన ప్రియుడికి దగ్గరగా ఉన్న సమయంలో తుపాకితో కాల్పులు జరిపాడు. ప్రియుణ్ని బతికించుకోవడానికి విఫలయత్నం చేసిన ఆమె.. చివరికి ఓ హోటల్గదిలో ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులో సంచలనం రేపిన ఈ సంఘటనపై ఇరుకుటుంబాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ బెంగళూరుకు చెందిన శ్రుతి గౌడ(32) రైల్వే గొల్లహళ్లిలో పంచాయితీ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు భర్త రాజేశ్ గౌడ(33), ఇద్దరు పిల్లలు, మామ గోపాలకృష్ణ(78) ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి కారులో బయలుదేరిన శ్రుతి.. హేసరఘట్ట ప్రాంతంలో అమిత్ కేశవమూర్తి అనే వ్యక్తిని కలుసుకుంది. వివాహితుడైన అమిత్.. న్యాయవాదిగా పనిచేస్తున్నారు. చిన్నపాటి రాజకీయ నాయకుడు కూడా. ఇటీవలే ఆయన జేడీ(యూ) నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బైకర్‌గానూ ఆయనకు పేరుంది. శృతి మీద అనుమానంతో ఆమె కారును(జీపీఎస్ ట్రాకింగ్ పరికరం ద్వారా) వెంటాడిన రాజేశ్ గౌడ.. తండ్రి గోపాల కృష్ణ సాయంతో అమిత్‌పై దాడిచేశాడు. కారులో శ్రుతి, అమిత్‌లు పక్కపక్కన కూర్చుని ఉండగానే కాల్పులు జరిపి వెళ్లిపోయారు. రక్తపుమడుగులో పడిపోయిన అమిత్‌ను శ్రుతి అతికష్టంమీద సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు తీవ్రత దృష్యా ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈలోపే శ్రుతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో శ్రుతి తన పుట్టింటివారికి ఫోన్‌చేసి లాడ్జిలో ఉన్నట్లు చెప్పింది. అయితే వారు వెళ్లేసరికి ఆమె దుప్పటితో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి రెండు వేరు వేరు(అమిత్ కేశవమూర్తి హత్య, శ్రుతి ఆత్మహత్య) కేసులు నమోదుచేశామని పోలీసులు మీడియాకు తెలిపారు. అమిత్‌ను కాల్చిచంపింది రాజేశ్ గౌడా లేక తండ్రి గోపాల కృష్ణా అనేది తెలియాల్సిఉందని, అమిత్‌తో శ్రుతి బంధం, ఆత్మహత్యకు దారితీసిన ఇతర అంశాలను పరిశీలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఉదంతంపై ఇరు కుటుంబాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లోనూ రెండు కుటుంబాలు ఆనందంగా గడిపాయని, ఇంతలోనే చంపుకునేంత గొడవలు ఏమొచ్చాయో అర్థంకావడంలేదని అమిత్ తల్లి వెంకమ్మ వాపోయారు. మృతులు అమిత్, శ్రుతి(పైన), నిందితులు గోపాలకృష్ణ, రాజేశ్ గౌడ(కింద) (ఫైల్ ఫొటోలు) -
కడుపునొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య
మిడ్జిల్ : కడుపునొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. తలకొండపల్లి మండలంలోని వెంకటాపూర్‌కు చెందిన అలివేల (30) కు సుమారు పదేళ్ల క్రితం మిడ్జిల్ మండలంలోని మున్ననూర్ వాసి లక్ష్మయ్యతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, కొన్నాళ్లుగా భార్య తరచూ కడుపునొప్పితో బాధపడుతుండగా వివిధ ఆస్పత్రుల్లో చూపించుకున్నా ఎంతకూ తగ్గలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె గురువారం సాయంత్రం ఇంట్లోనే పురుగుమందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మతి చెందింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ రమేష్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మతదేహాన్ని బంధువులకు అప్పగించారు.